Ganesh Chaturthi Fasting Rules: ఉపవాస సమయంలో ఏం తినాలి.. ఏం తినకూడదో తెలుసా?
ABN, Publish Date - Aug 26 , 2025 | 03:39 PM
గణేష్ చతుర్థి రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే, ఈ ఉపవాస సమయంలో ఏమి తినాలి? ఏమి తినకూడదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. అనేక వీధుల్లో ఇప్పటికే గణపయ్య కొలువుదీరాడు. గణేష్ చతుర్థి రోజున, ప్రజలు గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి, భక్తితో పూజలు చేసి ప్రసాదాలు పెడతారు. అంతేకాదు గణేష్ చతుర్థి రోజున చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. అయితే, ఈ ఉపవాస సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఏం తినాలి? ఏం తినకూడదు?
గణేష్ చతుర్థి ఉపవాసం సమయంలో సాత్విక (తేలికపాటి) భోజనం తీసుకోవాలి. ఉపవాసం చేసేవారు పాలు, మజ్జిగ తోపాటు నెయ్యితో తయారుచేసిన పాయసం వంటివి తీసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రూట్ సలాడ్ వంటివి కూడా తీసుకోవచ్చు. ఆపిల్, బొప్పాయి, బెర్రీస్ వంటి పండ్లని తినొచ్చు. స్నాక్స్‌గా ఉడికించిన పల్లీలు, మొక్కజొన్న, మొక్కజొన్న వడలు, శనగలు ఇలాంటి వాటిని ఉడికించి తినవచ్చు. వీటి వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే డ్రై ప్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఖర్జూరాలు, బాదం పప్పు, ఎండుద్రాక్ష, అవకాడో, పొద్దుతిరుగుడు గింజలు వంటివి తీసుకోవచ్చు. అలాగే, కూరగాయలతో తయారుచేసిన సూప్స్ కూడా తీసుకోవచ్చు. అయితే, ఉపవాస సమయంలో మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, మద్యం, ఇతర తామసిక పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
ఉపవాసంలో చేయవలసినవి:
తెల్లవారుజామున పవిత్ర స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి.
తేలికపాటి, సాత్విక ఆహారం తీసుకోవాలి.
ఉపవాస సమయంలో పుష్కలంగా నీరు తాగాలి.
గణేషుడికి గరిక, పండ్లను సమర్పించి పూజలు చేయాలి.
ఉపవాసం స్వీయ-నియంత్రణ, నిగ్రహం, స్థిరత్వాన్ని పెంచుతుంది.
ఉపవాసంలో చేయకూడనివి:
మాంసాహారం, మద్యం, తామసిక ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
ఉపవాస సమయంలో ఉల్లి, వెల్లుల్లి వంటివాటిని తీసుకోకూడదు.
గణపతి పూజలో తులసి దళాలను, మొగలి పువ్వులను ఉపయోగించకూడదు.
కుటుంబ సభ్యులతో గొడవ పడటం లేదా కోపం తెచ్చుకోవడం చేయకూడదు.
చంద్రుని దర్శనం అయిన తర్వాత ఉపవాసాన్ని ముగించి, గణేశుడిని పూజించాలి.
(గమనిక: పై కథనంలో పేర్కొన్న సమాచారం పలు శాస్త్రాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఇవ్వడమైనది. ఇది సంప్రదాయ విశ్వాసాలను ఆధారంగా చేసుకున్నదే గాని ఆధునిక శాస్త్రీయ ఆధారంగా కాదు. వీటిని పాటించాల్సిన అవసరం మీ వ్యక్తిగత విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది.)
Also Read
గణపయ్యకు ఇష్టమైన 5 మోదకాల రెసిపీస్.. ఈసారి తప్పక ట్రై చేయండి..
ఈ సమయాల్లో గణపతిని ప్రతిష్టిస్తే శుభ ఫలితాలు
For More Devotional News
Updated Date - Aug 26 , 2025 | 05:02 PM