Bengaluru: సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది..
ABN, Publish Date - May 27 , 2025 | 01:57 PM
సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య ఉదంతమిది. ప్రేమ వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలు కలిగాక, మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారానికి అడ్డుగా ఉన్నాడని, భర్తనే హత్య చేయించింది. ఇక వివరాల్లోకి వెళితే..
- భార్యతోపాటు ప్రియుడి అరెస్టు
బెంగళూరు: ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరి పిల్లలు కలిగాక మరో వ్యక్తితో సన్నిహితంగా మారి ఏకంగా భర్తను హత్య చేయించిన భార్య ఉదంతం చిక్కమంగళూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఎన్‌ఆర్‌పుర తాలూకా కరగుందలో సుదర్శన్ (35)ను సుపారీ ఇచ్చి భార్య కమల హత్య చేయించినట్టు పోలీసులు గుర్తించారు. కమలకు ఇటీవల శివరాజ్ అనే వ్యక్తితో సన్నిహితం ఏర్పడింది.
వీరి వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి హతమార్చాలని నిర్ధారించుకున్నారు. సుదర్శన్‌కు మిత్రులు విందుకు తీసుకెళ్లారు. మద్యంలో నిద్రమాత్రలు కలిపి తాగించారు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారు. కరగుంద బస్టాండ్‌లో మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈమేరకు కమల ఎన్‌ఆర్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త సుదర్శన్‌ను ఎవరో హత్య చేశారన్నారు. మాకు ఎవరితోనూ గొడవలు లేవని, ఎందుకు జరిగిందో తెలియదంటూ నమ్మించే ప్రయత్నం చేశారు.
పోలీసులు విభిన్న కోణాలలో దర్యాప్తు చేపట్టారు. తొలుత నాకెటువంటి సంబంధాలు లేవని దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ప్రియుడు శివరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో భిన్నమైన అభిప్రాయాలు తెలిపిన మేరకు ఎన్‌ఆర్‌పుర పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించారు. కమల, శివరాజ్‌తోపాటు అతడి స్నేహితులను సోమవారం అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!
Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి
Read Latest Telangana News and National News
Updated Date - May 27 , 2025 | 01:57 PM