Hyderabad: ఆదాయం సరిపోక ఆ యువకులు చేసిన పనేంటో తెలిస్తే..
ABN, Publish Date - Jun 10 , 2025 | 09:42 AM
ఒడిశా నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
- గంజాయి సరఫరా
- ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్
-11 కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ సిటీ: ఒడిశా నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా మల్కాన్‌గిరి(Odisha, Malkangiri) ప్రాంతానికి చెందిన అమన్ హంతటి (22), రైమాన్ గూటే (22) నగరంలో ఉంటూ సెంట్రింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారు.
ఆదాయం సరిపోకపోవడంతో గంజాయి సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. మల్కాన్‌గిరికి చెందిన గంజాయి విక్రేత జినోను సంప్రదించారు. నగరానికి గంజాయి తరలించేందుకు రూ. 12,500 ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. భద్రాచలం(Bhadrachalam) బస్టాండ్ వద్ద జినో సహాయకులు ఇచ్చిన 11 కిలోల గంజాయి తీసుకొని ప్రైవేట్ ట్రావెల్ బస్‌లో నగరానికి చేరుకున్నారు.
ధూల్‌పేట(Dhulpet)కు చెందిన వినోద్ సింగ్‌కు అప్పగించేందుకు అఫ్జల్‌గంజ్ జేకే నర్సరీ వద్ద ఎదురుచూస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 11 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధరలు
నిన్ను ఏమడిగారు.. నేనేం చెప్పాలి
Read Latest Telangana News and National News
Updated Date - Jun 10 , 2025 | 09:46 AM