ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra: శోభనం కోసం ఒత్తిడి చేసిన భర్తను అంతమొందించిన భార్య

ABN, Publish Date - Jun 12 , 2025 | 08:41 PM

శోభనం కోసం బలవంతం చేసిన భర్తను హతమార్చిందో భార్య. మహారాష్ట్రలో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

Sangli husband murder

ఇంటర్నెట్ డెస్క్: మేఘాలయ మర్డర్ కలకలం కొనసాగుతున్న నేపథ్యంలోనే మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. శోభనం కోసం పట్టుబట్టిన భర్తను ఓ యువతి గొడ్డలితో నరికి చంపింది. సాంగ్లీ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, 53 ఏళ్ల అనిల్ లోఖండే‌ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నారు. భార్య రాధికతో (27) కలిసి కుప్వాద్ తెహ్‌సిల్ ప్రాంతంలో ఉంటున్నారు. కాగా, బుధవారం రాత్రి 12.30 సమయంలో భార్యాభర్త మధ్య శోభనం విషయంలో వివాదం తలెత్తింది. శారీరంగా దగ్గరయ్యేందుకు అతడి ప్రయత్నించగా ఆమె నిరాకరించింది.

ఈ క్రమంలోనే ఆమె అతడు నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసి చంపేసింది. లోఖండే మొదటి భార్య సర్వై కల్ క్యాన్సర్‌తో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. తీవ్ర ఆగ్రహానికి లోనైన రాధిక భర్తపై గొడ్డలితో దాడి చేసిందని చెప్పారు. నిందితురాలిని అరెస్టు చేశామని చెప్పారు. పెళ్లైన 15 రోజులకే లోఖండే దారుణ రీతిలో కన్నుమూయడం స్థానికంగా కలకలానికి దారి తీసింది.

ఇక దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న మేఘాలయ మర్డర్ కేసులో నిందితురాలు సోనమ్ తన భర్త హత్యకు కారకురాలిని తానేనని అంగీకరించింది. పెళ్లికి ముందే ఆమెకు రాజ్ కుశ్వాహా అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఈ నేపథ్యంలో భర్త హత్యకు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కుట్ర పన్నని ఆమె హనీమూన్‌లో ఉండగా భర్తను హత్య చేయించింది. ఈ కేసులో పోలీసులు సోనమ్‌తో పాటు ఆమె బాయ్‌‌ఫ్రెండ్ కుశ్వాహా, ఇతర నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించి చివరకు నిందితురాలు దొరికిపోయిందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

త్వరగా ఇంటికొచ్చిన భర్తకు షాక్.. భార్య మరొకరితో క్లోజ్‌గా ఉండటం చూసి..

తండ్రి, సోదరుడి చేతిలో యువతి సజీవదహనం.. సహజీవనం చేస్తోందని తెలిసి..

Read Latest and Crime News

Updated Date - Jun 12 , 2025 | 08:50 PM