ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber ​​crime: నకిలీ వివరాలతో బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి..

ABN, Publish Date - Mar 08 , 2025 | 08:25 AM

నకిలీ వివరాలతో బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన ఓ యువకుడు దాదాపు రూ.8కోట్లు సైబర్‌ నేరగాళ్ల ఖాతాలకు మళ్లించిన అతడు ఎట్టకేలకు తనపాపం పండి పోలీసుకు దొరికిపోయాడు. అదుపులోకి తాసుకున్న పొలీసులు తమదైన శైలీలో విచారణ జరిపితే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

- నకిలీ ఖాతాల ద్వారా రూ. 8 కోట్లు విదేశాలకు..

-18 కేసుల్లో నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: ట్రేడింగ్‌ మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లకు(Cyber ​​criminals) ఖాతాలు సమకూర్చి, సహకరిస్తున్న నిందితుడిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌కు చెందిన సావలియ రవి (25) నకిలీ వివరాలతో పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచాడు. వీటికి కమీషన్‌ తీసుకుంటూ నేపాల్‌, చైనా(Nepal, China)లో ఉన్న సైబర్‌ నేరగాళ్లకు అందిస్తున్నాడు. సైబర్‌ మోసగాళ్లు ఈ ఖాతాల్లోకి అమాయకుల డబ్బు జమ చేయించుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నకిలీ పత్రాలతో.. రూ.4.26 కోట్ల విలువైన స్థలం విక్రయం


ఇలా సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి పలు దఫాలుగా రూ.87.51 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు(Cybercrime police) సాంకేతిక ఆధారాల ద్వారా బాధితుడి ఖాతా నుంచి రూ.21 లక్షలు గుజరాత్‌(Gujarat)లోని లుక్స్‌ అండ్‌ లైక్స్‌ సంస్థకు చెందిన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి జమ అయ్యాయని గుర్తించారు. దీనిపై కూపీలాగిన సైబర్‌ క్రైం పోలీసులు ఈ ఖాతా నకిలీ వివరాలతో రవి అనే వ్యక్తి ప్రారంభించాడని గుర్తించారు.


అంతేకాకుండా నకిలీ ధ్రువపత్రాలతో ఇతడు పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి సైబర్‌ నేరగాళ్లకు విక్రయిస్తున్నాడని గుర్తించారు. పలు ఖాతాల ద్వారా సుమారు రూ.8కోట్లు సైబర్‌ నేరగాళ్ల ఖాతాలకు మళ్లించాడని, దేశ వ్యాప్తంగా ఇతడిపై 18 కేసులు నమోదై ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో సైబర్‌ క్రైం ఏసీపీ శివమారుతి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదరావు బృందం గుజరాత్‌ వెళ్లి నిందితుడు సావలియ రవిని అరెస్ట్‌ చేశారు.


ఈ వార్తను కూడా చదవండి: తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

ఈ వార్తను కూడా చదవండి: హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

ఈ వార్తను కూడా చదవండి: ఎకరా టార్గెట్‌ 100 కోట్లు!

ఈ వార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 08 , 2025 | 08:25 AM