Share News

తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

ABN , Publish Date - Mar 08 , 2025 | 05:10 AM

ప్రముఖ రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది.

తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

న్యూఢిల్లీ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ప్రముఖ ఒడియా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గోపీనాథ్‌ మహంతి రచించిన ‘దాడీ బుధా’ అనే నవలను ‘ఈతచెట్టు దేవుడు’ పేరిట తెలుగులోకి అనువదించినందుకు తుర్లపాటినిఈ పురస్కారం వరించింది. ఒడిశాలోని బరంపురంలో నివసిస్తున్న రాజేశ్వరి అనేక రచనలను ఒడియా నుంచి తెలుగులోకి అనువాదం చేశారు.


స్వతంత్ర రచనలూ చేశారు. గతంలో అనేక పురస్కారాలను ఆమె స్వీకరించారు. కాగా తెలుగుతోపాటు 21 భాషల్లో అనువాద పురస్కారాలను శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు ప్రకటించారు. తెలుగు అనువాద పురస్కారాన్ని ఏకగ్రీవంగా నిర్ణయించిన న్యాయనిర్ణేతల్లో ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి ఎ.కృష్ణారావు, ప్రముఖ రచయితలు దాసరి అమరేంద్ర, గుడిపాటి వేంకటేశ్వర్లు ఉన్నారని ఆయన వెల్లడించారు.

Updated Date - Mar 08 , 2025 | 05:10 AM