Share News

Hyderabad: నకిలీ పత్రాలతో.. రూ.4.26 కోట్ల విలువైన స్థలం విక్రయం

ABN , Publish Date - Mar 08 , 2025 | 07:45 AM

నకిలీ పత్రాలతో దాదాపు రూ. 4 కోట్లకు పైగా విలువచేసే స్థలాన్ని అమ్మిన వ్యక్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోగల రాజేంద్రనగర్‏కు చెందిన 15 మంది వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి ఈ తరహ మోసాలకు పాల్పడుతుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Hyderabad: నకిలీ పత్రాలతో.. రూ.4.26 కోట్ల విలువైన స్థలం విక్రయం

- ముఠాలో ఏడుగురి అరెస్ట్‌

హైదరాబాద్: నకిలీ పత్రాలు సృష్టించి రూ.4.26కోట్ల విలువ చేసే 600 గజాల స్థలాన్ని ఇతరులకు విక్రయుంచిన 15 మంది సభ్యుల ముఠాలోని ఏడుగురిని రాజేంద్రనగర్‌(Rajendranagar) పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1.69 కోట్ల నగదు, రూ. 40లక్షల విలువజేసే ఫార్చునర్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్‌ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌(DCP Chintamaneni Srinivas), ఏసీపీ తుల శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్‌ క్యాస్ట్రోలతో కలసి వివరాలు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: దుబాయ్‌ లాటరీ పేరుతో సైబర్‌ మోసం.. రూ.2.26 లక్షలు సమర్పయామి..


సోమాజిగూడకు చెందిన వినీత చౌదరి 2005లో గండిపేట్‌ మండలం, బండ్లగూడ జాగీర్‌ పద్మశ్రీహిల్స్‌లో 600 గజాల స్థలాన్ని వి.సంజీవరెడ్డి నుంచి కొనుగోలు చేసింది. తమ స్థలం చూస్తుండమని పద్మశ్రీహిల్స్‌లో నివాసి గుండాడ నాగేశ్‌కు చెప్పి ఆమె కెనడా వెళ్లారు. ఈ నేపథ్యంలో గుండాడ నాగేశ్‌ బండ్లగూడకు చెందిన ఇమ్మానుయేల్‌, అతని భార్య పుష్ప కుమ్మక్కై స్థలాన్ని కాజేయాలని కుట్ర పన్నారు. ఈ కుట్రలో ఇమ్మానుయేల్‌ కుమారులు రోహన్‌, అలెక్స్‌తో పాటు అతని స్నేహితురాలు శ్రేయ చేరారు.


అయితే, వినీతచౌదరి కాప్రాకు చెందిన దివాకర వర్మకు జీపీఏ చేసినట్లు, పవర్‌ ఆఫ్‌ అటార్ని ఇచ్చినట్లు నకిలీ పత్రాలు తయారు చేశారు. ఆ తర్వాత స్థలాన్ని నాగోల్‌కు చెందిన సుభాషిణీ(Subhashini)కి రూ.63లక్షలకు విక్రయించారు. ఇదంతా ఉత్తుత్తి రిజిస్ట్రేషన్‌యే అని తెలిసింది. అలా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న సుభాషిణి సదరు స్థలాన్ని ధ్రువంతీర కన్‌స్ట్రక్షన్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి, భరత్‌రెడ్డిలకు రూ.4.26 కోట్లకు విక్రయించారు.


city2.2.jpg

నగరానికి వచ్చిన వినీతాచౌదరి తనకు జరిగిన మోసాన్ని గుర్తించి రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ క్యాస్ట్రో దర్యాప్తు చేపట్టి నకిలీ పత్రాలు సృష్టించిన ఇమ్మానుయేల్‌, గుండాడ నాగేశ్‌ లతో పాటు వారికి సహకరించిన నాంపల్లి దివాకర్‌ వర్మ, పల్సం సుభాషిణీ, పుష్ప, రోహన్‌, అలెక్స్‌లను అరెస్ట్‌ చేశారు. చంద్రశేఖర్‌, శ్రేయ, డాక్యుమెంట్‌ రైటర్‌ అనిల్‌, బ్రోకర్లు శివరాజ్‌, వలీ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు.


ఈ వార్తను కూడా చదవండి: తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

ఈ వార్తను కూడా చదవండి: హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

ఈ వార్తను కూడా చదవండి: ఎకరా టార్గెట్‌ 100 కోట్లు!

ఈ వార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 08 , 2025 | 07:45 AM