Hyderabad: దుబాయ్ లాటరీ పేరుతో సైబర్ మోసం.. రూ.2.26 లక్షలు సమర్పయామి..
ABN , Publish Date - Mar 08 , 2025 | 07:05 AM
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రతిరోజూ ఎక్కడో ఇకచోట ఈ మోసాలు జరుతుగూనే ఉన్నాయి. పోలీస్ శాఖ ఈ తరహ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పస్తున్నటికీ.. సైబర్ మోసగాళ్లు మాత్రం కొత్తదారులు వెతుకుతూ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.
-100 గ్రాముల బంగారం, లాప్‌టాప్ గెలుచుకున్నారంటూ ఫోన్
- కస్టమ్స్ క్లియరెన్స్ పేరుతో రూ.2.26 లక్షలు కాజేత
హైదరాబాద్ సిటీ: దుబాయ్(Dubai)లోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ జమ్‌జమ్ ఎలకా్ట్రనిక్స్ నిర్వహించిన లాటరీలో మీకు బహుమతి వచ్చిందని చెప్పి, కస్టమ్స్ క్లియరెన్స్ పేరుతో నగరానికి చెందిన వ్యాపారి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2.26లక్షలు కాజేశారు. నగరానికి చెందిన వ్యాపారికి +971501151330 నంబర్ నుంచి సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. దుబాయ్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ అందించే గిఫ్ట్ కూపన్‌లు మీరు గెలుచుకున్నారని తెలిపాడు.
ఈ వార్తను కూడా చదవండి: Etela Rajender: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే
గిఫ్ట్ కూపన్‌లో భాగంగా 100గ్రాముల బంగారం, లాప్‌టాప్, ట్యాబ్‌లు ఇస్తామని చెప్పి, అడ్రస్ వివరాలు తీసుకున్నాడు. మరుసటి రోజు ఫోన్ చేసిన సైబర్ నేరగాడు మీ పేరున వచ్చిన గిఫ్ట్ పార్సిల్‌ను ట్యాక్స్ చెల్లించలేదని ముంబై కస్టమ్స్ అధికారులు(Mumbai Customs officials) అడ్డుకున్నారని, ట్యాక్స్ చెల్లిస్తే విడుదల చేసుకోవచ్చని డబ్బులు ఖాతాలోకి జమ చేయించుకున్నాడు.

మరుసటి రోజు హైదరాబాద్ కస్టమ్స్ అధికారుల పేరు చెప్పి మరికొంత వసూలు చేశారు. ఇలా పలు దఫాలుగా రూ.2.26లక్షలు వసూలు చేశారు. జీఎస్టీ పేరుతో మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం ఠాణా(Cyber Crime Station)లో ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
ఈ వార్తను కూడా చదవండి: హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి
ఈ వార్తను కూడా చదవండి: ఎకరా టార్గెట్ 100 కోట్లు!
ఈ వార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
Read Latest Telangana News and National News