Hyderabad: అరెస్ట్ పేరుతో రూ.1.50 లక్షలు లూటీ..
ABN, Publish Date - Mar 04 , 2025 | 09:41 AM
మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అంటూ ఓ వృద్ధుడిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) అతడి వద్ద రూ. 1.50 లక్షలు కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత(DCP Dhara Kavitha) తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 60 ఏళ్ల వృద్ధునికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.
హైదరాబాద్ సిటీ: మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అంటూ ఓ వృద్ధుడిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) అతడి వద్ద రూ. 1.50 లక్షలు కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత(DCP Dhara Kavitha) తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 60 ఏళ్ల వృద్ధునికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ‘ముంబై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కార్యాలయం(Mumbai Enforcement Director's Office) నుంచి మాట్లాడుతున్నా. మీ పేరుతో బర్మాకు వెళ్తున్న అనుమానాస్సద పార్శిల్‌ను పట్టుకున్నాం.
ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: తేల్చి చెప్పేశారు.. ఆదివారం ఆఖరు..
అందులో బర్మాకు చెందిన ఏటీఎం కార్డులు, పాస్‌పోర్టులు(ATM cards and passports), ఎండీఎంఏ డ్రగ్స్ ఉన్నాయి. మీపై మాదక ద్రవ్యాల కేసు నమోదైంది. అరెస్టు తప్పదు’ అని హెచ్చరించాడు. ఆ పార్శిల్‌తో తనకు సంబంధం లేదని, 15 ఏళ్లుగా ముంబై ముఖమే చూడలేదని బాధితుడు బదిలివ్వడంతో అవతలి వ్యక్తి బెదిరింపులకు దిగాడు. ‘మీ ఖాతా నుంచి అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా మాకు సమాచారం ఉంది. మీకు క్లీన్ చిట్ ఇవ్వాలంటే ఆర్‌బీఐకి చెందిన ఖాతాలో కొంత డబ్బు జమ చేయాలి.
అరెస్టు తప్పదు. మీ తప్పు లేదని తేలితే మీ డబ్బులు తిరిగి మీ ఖాతాలో జమ చేస్తాం’ అని చెప్పాడు. దాంతో బాధితుడు వారు చెప్పిన ఖాతాలో రూ.1.50 లక్షలు జమ చేశాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవతలి వ్యక్తి స్పందించకపోవడంతో ఇదంతా సైబర్ మోసమని గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు
ఈ వార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..
ఈ వార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత
ఈ వార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి
Read Latest Telangana News and National News
Updated Date - Mar 04 , 2025 | 10:41 AM