ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime News : రూ.25 లక్షలు సరిపోదంట.. అదనపు కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజక్షన్..

ABN, Publish Date - Feb 16 , 2025 | 05:03 PM

Crime News : అదనపు కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజక్షన్ ఇచ్చిన అత్తమామలు. కోటి కలలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఇల్లాలిని బలి తీసుకున్న మొగుడి సెక్స్ శాడిజం. రెండు వేరు వేరు ఘటనలు. వేరువేరు కుటుంబాలు. వేరు వేరు ప్రాంతాలు. కానీ బలైపోయింది మాత్రం మగువలు.

Guard Your Girls Say No to Dowry and Yes to Their Safety

Crime News : 90లో వచ్చిన సినిమాలు చూసిన వాళ్లకు వరకట్న వేధింపులు అనగానే కోడలిని రోడ్డుమీదికి ఇచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టడం అనే కాన్సెప్ట్ మాత్రమే తెలిసి ఉంటుంది. మూడు దశాబ్దాలు గడిచి పోయాయి. కాలం ఏఐ యుగంలోకి దారి తీసింది. పెళ్లిళ్లు, పెళ్లి చూపుల విధానాలు అన్నీ మారాయి. కానీ సమసిపోని సమస్య ఒకటి అలాగే మిగిలిపోయింది. ఒకప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసేవారు. ఇప్పుడు అబ్బాయి బ్యాంకు బ్యాలెన్స్, క్రెడిట్ స్కోరు మాత్రమే చూసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అమ్మాయిలు ఇదే కోరుకుంటున్నారు. వారికి తల్లితండ్రుల ప్రోత్సాహం అదే తీరుగా ఉంటోంది. అబ్బాయి గుణగణాలు, క్యారెక్టర్, విలువలు, అలవాట్లపై ఆరా తీసే వాళ్ళు తక్కువ అయిపోయారు. ఎన్నారై అనగానే పల్లెటూరు అమ్మాయిలు కూడా క్యూ కడుతున్నారు. అక్కడ మనోడు చేస్తున్న ఘనకార్యాలు ఏమిటనేది కనీసం ఆరా తీయరు. కూతుళ్లకి మంచి రిచ్ లైఫ్ ఇవ్వాలని ఆరాటపడే వారి తల్లితండ్రులు ఒక్క విషయం మర్చిపోతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న బిడ్డ రిచ్ లైఫ్ లీడ్ చేస్తుంటే ఆనందించాలి అనుకుంటున్నారు తప్ప.. లైఫ్ లాంగ్ తమ అమ్మాయి సేఫ్ గా ఉంటుందా లేదా అనేది పట్టించుకోవడం లేదు. దానివల్ల జరుగుతున్న దారుణాలే ఇవన్నీ.


ధనదాహం తీరక.. అదనపు కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజక్షన్..

ఎగ్జాంపుల్ గా రెండు ఘటనల్ని ప్రస్తావించుకుందాం. ఒకటి ఉత్తరాఖండ్‌లో జరిగింది. అదనపు కట్నం తేలేదనే కోపంతో అత్తమామలు తమ కోడలికి హెచ్ఐవీ ఇంజక్షన్ ఇచ్చారట. ఈ వివాహం రాష్ట్రాలు దాటి జరిగిన ఓ తప్పిదం. వరుడు ఉత్తరాఖండ్ కు చెందిన అభిషేక్. వధువు ఉత్తరప్రదేశ్ కు చెందిన యువతి. గత ఏడాదే వివాహం జరిగింది. అప్పట్లోనే పాతిక లక్షలు కట్నం సమర్పించుకున్నారు. కానీ మనోడికి పాతిక లక్షల కట్నం సరిపోలేదు. "మావాడి రేంజ్ కి అప్సరసలు క్యూ కడతారు. కానీ ముష్టి పాతిక లక్షలతో నిన్ను ఇంటికి తెచ్చుకున్నాం. ఇంకో పాతిక లక్షలు తీసుకురా. స్కార్పియో కారు కొనాలి" అంటూ భర్త, అతని తల్లిదండ్రులు తమ సైకో ఇజాన్ని బయట పెట్టడం మొదలుపెట్టారు. "నా పెళ్లికోసం మా తల్లిదండ్రులు ఉన్నదంతా ఊడ్చిపెట్టారు. ఇంకా ఏం కావాలి మీకు.." అంటూ ఆ ఇల్లాలు ఎదురు తిరగడంతో పైశాచికంగా, ప్లాన్డ్ గా ఆమెకు హెచ్ఐవి ఇంజక్షన్ ఇచ్చి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసి పెట్టారు అత్తమామలు. ఈ దారుణంపై ఆ ఆడబిడ్డ న్యాస్థానాన్ని ఆశ్రయించింది. పైశాచికంగా ప్రవర్తించిన ఆ కుటుంబం న్యాయస్థానం తీర్పుతో జైలు ఊచలు లెక్కపెట్టొచ్చు గాక.. ఛిద్రం అయిపోయిన ఆ అమ్మాయి జీవితం తిరిగి తీసుకురాగలరా ఎవరైనా?


పెళ్లి రోజు నుంచే భర్త శాడిజం.. మరో కోడలు బలి..

మరో ఉదంతం చూద్దాం. ఇది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. విశాఖపట్నం జిల్లా గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదయింది. ఇక్కడ భార్యను బలి తీసుకున్న సైకో పేరు నాగేంద్రబాబు. అబ్బో ఏమి అందగాడో లెండి! అమాయకురాలిని భార్యగా తెచ్చుకున్నాడు. మనోడికి కోటు, సూటు వేసి అలంకరించి పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. అల్లుడు ఎంత గుణవంతుడో కదా అంటూ ఆ సమయంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇక మన బిడ్డ జీవితాంతం ఆనందంతో జీవిస్తుంటే.. మన పంట పండినట్లే.. మన కలలు నెరవేరినట్లే.. అని సంబరపడిపోయారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. పెళ్లి జరిగింది. ఫస్ట్ నైట్ రోజే అమ్మాయికి నరకం మొదలైంది. అత్తమామలకు చెప్పుకుంటే అనుభవించు అన్నారు. తల్లిదండ్రులకు మొరపెట్టుకుంటే.. ఏదో ఒకటి చేసి సమస్య పరిష్కారం చేసుకుందాం అన్నారు. కానీ పాపం.. ఆమెకు అంత టైం లేదు. ఆ పైశాచికత్వాన్ని, సెక్స్ పేరిట వాడు ప్రదర్శించే వికారాన్ని భరించలేక.. ఈ బతుకు తనకు వద్దు అనుకుంది. వాడి ఫోన్, లాప్టాప్ నిండా బూతు కంటెంటే. వాడి ఒంటి నిండా కామమే. స్త్రీని బొమ్మగా చూసే వికృత బుద్ధి వాడి నరనరాన ఇంకి పోయింది. అసహజ లైంగిక పద్ధతులు, వావివరసల్లేని కామం, పోర్న్ ఆడిక్ట్ తో కుళ్ళిపోయిన మగతనం మనోడి సొంతం. ఒక మనిషి ఇంత దారుణంగా చెడిపోతాడని, ఇంత వికృతంగా ప్రవర్తించగలడని.. ఆ అమాయకురాలి ఊహకైనా అందలేదు. ఈ నరకం కంటే.. ఉరే సుఖంగా ఉంటుందని.. ఆత్మహత్య చేసుకుంది పాపం ఆ ఇల్లాలు. తమ బిడ్డని ఎలా పెంచుకున్నాం? ఎలాంటి వాడి చేతిలో పెడుతున్నాం అని ఆ తల్లిదండ్రులు కనీసం ఆలోచించకపోవడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుంది.


ప్రేమ పెళ్లిళ్లు విఫలమవుతాయనేది మన సమాజంలో చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం. కానీ ప్రేమ పెళ్లిళ్లతో పాటు.. అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా అంతే స్థాయిలో విఫలమవుతున్నాయి నేటి రోజుల్లో. జీవితంపై కోటి ఆశలతో జీవిత భాగస్వామిని ఎంచుకునే అమ్మాయిలు అయినా, తమ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడే తల్లిదండ్రులు.. వరుడి ఆస్తిపాస్తులు, అంతస్తు, ఉద్యోగం, సంపాదన, లైఫ్ స్టైల్ తో పాటు.. అంతకుమించి శోధించి తమ బిడ్డ భవిష్యత్తు క్షేమమా కాదా అని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు సరిపోల్చుకోనవసరం లేదు. సమాజంలో మారుతున్న తీరుతెనుల్ని, జరుగుతోన్న దారుణాల్ని గమనిస్తే చాలు.


ఇవి కూడా చదవండి..

Anantapur: అప్పు మీద ‘తప్పు’.. వ్యసనాలకు బానిసై దొంగగా మారా.

Lorry Theft: వామ్మో.. ఎంతకు తెగించారు.. ఏకంగా ఆగి ఉన్న లారీనే ఎత్తుకెళ్లారుగా..

Hyderabad: నీ ఫ్లాట్‌ అమ్మకపోతే చంపేస్తాం..

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 16 , 2025 | 07:05 PM