Hyderabad: నీ ఫ్లాట్ అమ్మకపోతే చంపేస్తాం..
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:31 AM
‘నీ ఫ్లాట్ అమ్మకపోతే చంపేస్తాం’ అని మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీం(Gangster Naeem) అనుచరుడు, అతని కుటుంబసభ్యులు రెండేళ్లుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడి బెదిరింపులు
- తమ ఇంటిపై దాడి చేశారని ప్రకాశ్‌రెడ్డి కుటుంబం..
- కులం పేరుతో దూషించారని శ్రీహరి కుమారుడు..
- సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు
హైదరాబాద్: ‘నీ ఫ్లాట్ అమ్మకపోతే చంపేస్తాం’ అని మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీం(Gangster Naeem) అనుచరుడు, అతని కుటుంబసభ్యులు రెండేళ్లుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్(Saidabad Inspector Raghavendra) తెలిపిన వివరాల ప్రకారం.. వై.ప్రకాశ్‌రెడ్డి, అనురాధ దంపతులు కుటుంబసభ్యులతో కలిసి సైదాబాద్ కరన్‌బాగ్‌లోని లక్ష్మీ అపార్ట్‌మెంట్స్ ఫ్లాట్ నెంబరు-1లో 20 ఏళ్లుగా నివాసముంటున్నారు. తొమ్మిది ప్లాట్లు ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌లో నయీం అనుచరుడిగా చలామణి అవుతున్న పి.శ్రీహరి పెంట్‌హౌస్ అద్దెకు తీసుకున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Prithviraj: ప్రేక్షకులను నవ్వించేందుకే అలా మాట్లాడా..
అనంతరం దానితో పాటు మరో నాలుగు ఫ్లాట్లను నయానోభయానో స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత అతడి కన్ను ప్రకాశ్‌రెడ్డి నివాసముంటున్న ఇంటిపై పడింది. తనకు ఆ ఫ్లాట్లు అమ్మాలంటూ రెండేళ్లుగా బెదిరిస్తూ వస్తున్నాడు. తాను ఫ్లాటు అమ్మనని ప్రకాశ్‌రెడ్డి పలుమార్లు ఖరాఖండిగా చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన శ్రీహరి, అతడి కుమారుడు ప్రసాద్, కతురు పింకి, భార్య మాధవి కలిసి ప్రకాశ్‌రెడ్డి ఇంటిపై ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ప్రకాశ్‌రెడ్డి ఇంట్లో లేడు. కానీ, ప్రకాశ్‌రెడ్డి భార్య అనురాధ, కుమారుడు శ్యాంసుందర్, అల్లుడు సంతోష్, గర్భిణి అయిన కోడలిపై దాడి చేశారు.
‘మేం నయీం అనుచరులం... చాలా హత్యలు చేశాం... మార్చి 30లోపు ఇల్లు ఖాళీ చేసి వెళ్లకపోతే అందరినీ చంపేస్తాం’ అంటూ హెచ్చరికలు చేసి వారు వెళ్లిపోయారు. దీంతో భయపడిన ప్రకాశ్‌రెడ్డి కుటుంబం దాడి ఘటనను గోప్యంగా ఉంచారు. ఇదిలా ఉండగా ప్రకాశ్‌రెడ్డి, అతని కుటుంబసభ్యులు తమను కులం పేరుతో దూషించారని, శ్రీహరి కుమారుడు రాజేంద్రప్రసాద్ మంగళవారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్(Saidabad Police Station)లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రకాశ్‌రెడ్డి భార్య అనురాధ కూడా శ్రీహరి, అతడి కుటుంబసభ్యులు తమ ఇంటిపై దాడి చేసి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారని ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
రక్షణ కల్పించాలని ప్రకాశ్‌రెడ్డి కుటుంబసభ్యుల వినతి
ఈ దాడి ఘటనపై ప్రకాశ్‌రెడ్డి కుటుంబసభ్యులు ఈస్ట్‌జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, ఏసీపీ వెంకన్న నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. శ్రీహరితో తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీహరి నయీం ప్రధాన అనుచరులలో ఒకరు. అతనిపై గతంలోనే నల్గొండ, హైదరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో పలు కేసులు నమోదయ్యాయి. పీడీ యాక్ట్ కింద జైలు శిక్ష అనుభవించి బయటకి వచ్చారని పోలీసులు పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన
ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు
ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర
ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ
Read Latest Telangana News and National News