Prithviraj: ప్రేక్షకులను నవ్వించేందుకే అలా మాట్లాడా..
ABN , Publish Date - Feb 13 , 2025 | 10:51 AM
సోషల్ మీడియాలో తనను, తన కుటుంబ సభ్యులను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సినీ నటుడు పృథ్వీరాజ్(Film actor Prithviraj) బుధవారం సైబర్ క్రైం కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఓ నటుడిగా సినిమా ఫంక్షన్ వేదికపై చేసిన వ్యాఖ్యలతో తనను వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసిందన్నారు.

- ఎవరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు
- సోషల్ మీడియా వేధింపులపై నటుడు పృథ్వీరాజ్ ఆగ్రహం
- సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: సోషల్ మీడియాలో తనను, తన కుటుంబ సభ్యులను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సినీ నటుడు పృథ్వీరాజ్(Film actor Prithviraj) బుధవారం సైబర్ క్రైం కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఓ నటుడిగా సినిమా ఫంక్షన్ వేదికపై చేసిన వ్యాఖ్యలతో తనను వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసిందన్నారు. ప్రేక్షకులను నవ్వించడానికే అలా మాట్లాడాను తప్ప ఎవరినీ ఉద్దేశించి ఆ వాఖ్యలు చేయలేదన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Mandakrishna Madiga: మందాకృష్ణమాదిగ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
వైసీపీకి చెందిన అనిల్ సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా పోస్ట్‌లు పెట్టి వేధించడమే కాకుండా ఇతరులతో కూడాఅసభ్యకరమైన పోస్టింగులు పెట్టిస్తున్నాడని, ఫోన్‌లో తిట్టిస్తున్నాడని పృథ్వీరాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికల్లో తన ఫోన్ నంబర్ పెట్టి వేధింపులకు గురిచేశారని, రోజుకు 1800 కాల్స్ వరకు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తాళలేక తాను ఆస్పత్రి పాలయ్యానని, ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చినవారిని నవ్వించడానికి సినిమా డైలాగ్ చెప్పానని, అది తప్పు అన్నట్లుగా తనను, తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి నీచమైన పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై త్వరలో ఏపీ హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. తనను వేధించిన వారిపై రూ.కోటి పరువు నష్టం దావా వేస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవల పృథ్వీరాజ్ లైలా సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.
అయితే తమ పార్టీ గురించి, అధినేత జగన్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడంటూ వైసీపీ అభిమానులు పృథ్వీని వేధింపులకు గురిచేస్తున్నారు. నిజానికి పృథ్వీ నివాసం గచ్చిబౌలి, సైబరాబాద్ కమిషనరేట్(Gachibowli, Cyberabad Commissionerate) పరిధిలో ఉంది. అక్కడే ఫిర్యాదు చేయాలని మొదట నగర సైబర్ క్రైం అధికారులు ఆయనకి సూచించారు. అయితే తన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని, ఫిర్యాదు ఇక్కడే తీసుకోవాలని కోరడంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన
ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు
ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర
ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ
Read Latest Telangana News and National News