Mandakrishna Madiga: మందాకృష్ణమాదిగ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , Publish Date - Feb 13 , 2025 | 10:28 AM
రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గమే మాలలతో తట్టుకోలేకపోయిందని, వర్గీకరణ గ్రూపు-3లో ఉన్న మహార్, నేతకాని కులస్థులు ఎలా తట్టుకుంటారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ(Mandakrishna Madiga) అన్నారు.

- మహార్, నేతకానిలకు అండగా ఉంటా
- మంద కృష్ణమాదిగ
హైదరాబాద్: రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గమే మాలలతో తట్టుకోలేకపోయిందని, వర్గీకరణ గ్రూపు-3లో ఉన్న మహార్, నేతకాని కులస్థులు ఎలా తట్టుకుంటారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ(Mandakrishna Madiga) అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ వర్గీకరణ సరైందని, రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలని చెప్పారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నారు..
జాతీయ మహార్ నేతకాని ఐక్య వేదిక ఆధ్వర్యంలో వేదిక నాయకులు నారాయణ దుర్గే మహార్ అధ్యక్షతన బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మహార్, నేతకానిలకు ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేసి రిజర్వేషన్ కేటాయించాలనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో మందకృష్ణ మాదిగ, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందా కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. మహార్, నేతకాని కులాలకు అన్యాయం జరగకుండా చూస్తానన్నారు.
దళితుల జీవితాలను బాగు చేసిన అంబేడ్కర్ మహార్ జాతికి చెందిన వారేనన్నారు. దళితులలో 59 కులాలకు దక్కాల్సిన వాటాను ఒక్క మాల కులమే ఇప్పటి వరకు అనుభవించిందని ఆరోపించారు. సర్టిఫికెట్‌ల కోసం మహార్, నేతకానిలు తమ అస్థిత్వం కోల్పోవద్దని, తహసీల్దార్‌ల ద్వారా కుల సర్టిఫికెట్ సాధించుకోవాలని సూచించారు.
ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన
ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు
ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర
ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ
Read Latest Telangana News and National News