Hyderabad: ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నారు..
ABN , Publish Date - Feb 13 , 2025 | 10:02 AM
ఉపాధ్యాయ సంఘానికి ప్రాతినిధ్యం వహించని, ఉపాధ్యాయ ఉద్యమ చరిత్ర తెలియని వ్యక్తికి ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టిక్కెట్‌ను ఓ ఉపాధ్యాయ సంఘం అమ్ముకుందని ఎమ్మెల్సీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ఆరోపించారు.

- ఉపాధ్యాయ సంఘంపై ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి ఆరోపణ
హైదరాబాద్: ఉపాధ్యాయ సంఘానికి ప్రాతినిధ్యం వహించని, ఉపాధ్యాయ ఉద్యమ చరిత్ర తెలియని వ్యక్తికి ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టిక్కెట్‌ను ఓ ఉపాధ్యాయ సంఘం అమ్ముకుందని ఎమ్మెల్సీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి(Kura Raghottam Redday) ఆరోపించారు. సంఘంతో సంబంధం లేని వ్యక్తిని అధికారిక అభ్యర్థిగా ఎలా నిలబెడతారని ఆయన ప్రశ్నించారు.
ఈ వార్తను కూడా చదవండి: Collector: ఎస్సీ హాస్టల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, తనను కాదని ఆ సంఘం ఉద్యమాలతో సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చిందన్నారు. 30 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయుడిగా చదువు చెప్పడంతో పాటు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంఘం నాయకుడిగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలపైన పోరాటం చేశానన్నారు.
గత ఆరు సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల సమస్యలను శాసనమండలిలో లేవనెత్తానని ఆయన పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పొరేట్‌లను గెలిపిేస్త మన ఉనికికికే ప్రమాదమని, ఉపాధ్యాయులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి గెలిపించాలి ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన
ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు
ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర
ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ
Read Latest Telangana News and National News