Collector: ఎస్సీ హాస్టల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Feb 13 , 2025 | 09:04 AM
చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Collector Anudeep Durisetty) అన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.

హైదరాబాద్ సిటీ: చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Collector Anudeep Durisetty) అన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని వంటగది, పరిసరాలను పరిశీలించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య..
అలాగే విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కోటాజీ, ఆర్డీఓ సాయిరాం, ఏఎస్డబ్ల్యూఓ మోహన్, హాస్టల్ వార్డెన్ మనోహర, తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన
ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు
ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర
ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ
Read Latest Telangana News and National News