Share News

Hyderabad: ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య..

ABN , Publish Date - Feb 13 , 2025 | 08:48 AM

ప్రేమించిన యువకుడికి వేరే యువతితో నిశ్చితార్థం జరగడంతో తట్టుకోలేక ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖైరతాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌(Khairatabad Police Station) పరిధిలో చోటుచేసుకుంది.

Hyderabad: ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య..

- ప్రేమించిన యువకుడికి వేరే యువతితో నిశ్చితార్థం

హైదరాబాద్: ప్రేమించిన యువకుడికి వేరే యువతితో నిశ్చితార్థం జరగడంతో తట్టుకోలేక ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖైరతాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌(Khairatabad Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌(Nizamabad) జిల్లా జక్రాన్‌పల్లి మండలం గన్యా తండాకు చెందిన కె. స్రవంతి(25) ఖైరతాబాద్‌ జగిర్ధార్‌ బడాలో నివాసం ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేసేది. కొద్ది రోజుల క్రితం ఉద్యోగం మానేసింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కదిపితే కన్నీళ్లే.. మృతదేహాలు ‘గాంధీ’ మార్చురీకి


దీంతో ఈనెల 11న ఆమె తండ్రి బాబూలాల్‌ ఫోన్‌ చేసి ఇంటికి రావాలని సూచించారు. అర గంటలో బయలుదేరుతా అని తండ్రికి చెప్పింది. రాత్రి అయినా ఆమె ఇంటికి రాలేదు, తండ్రి పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందన లేదు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్‌ పోలీసులు బాబూలాల్‌కు ఫోన్‌ చేసి ‘మీ కూతురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది’అని చెప్పారు. దీంతో స్రవంతి కుటుంబసభ్యులు నగరానికి వచ్చి ఆమె నివాసానికి వెళ్లారు.


city5.2.jpg

స్రవంతి(Sravanti) రెండు సంవత్సరాల నుంచి రమేష్‌ అనే యువకుడితో ప్రేమలో ఉందని, రమేష్‏కి మరో యువతితో ఈనెల 9న నిశ్చితార్థం జరిగిందని దీంతో డిప్రెషన్‌కు లోనై తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి బాబూలాల్‌ బుధవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన

ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు

ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర

ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 13 , 2025 | 08:48 AM