Share News

Anantapur: అప్పు మీద ‘తప్పు’.. వ్యసనాలకు బానిసై దొంగగా మారా..

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:41 PM

వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి దొంగగా మారాడు. ఈక్రమంలో ఓ మహిళను సైతం హత్య చేశాడు. ఈనెలలో నగర శివారులో ఓ మహిళ హత్య జరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిని నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Anantapur: అప్పు మీద ‘తప్పు’.. వ్యసనాలకు బానిసై దొంగగా మారా..

- అప్పులు తీర్చడానికే అంతం..

- సావిత్రమ్మ హత్యకేసు ఛేదన

- పోలీసుల అదుపులో నిందితుడు

అనంతపురం: వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి దొంగగా మారాడు. ఈక్రమంలో ఓ మహిళను సైతం హత్య చేశాడు. ఈనెలలో నగర శివారులో ఓ మహిళ హత్య జరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిని నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో అతను అప్పుల నేపథ్యంలోనే ఈ హత్యకు పాల్పడినట్లు చెప్పుకొచ్చినట్లు తెలిసింది. యాసర్‌ అనే వ్యక్తి రూ.5లక్షల వరకు అప్పులు చేశాడు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. ఈ క్రమంలో అతడి భార్య ఎలాగైనా సరే అప్పు తీర్చేయ్‌ అంది. దీంతో టీచర్స్‌ కాలనీలో ఒంటరిగా నివాసముంటున్న బొమ్మాళి సావిత్రమ్మ గొంతును కత్తితో కోసి హత్య చేశాడు. ఆమె మెడలోని ఐదుతులాల బంగారు గొలుసులను లాక్కెళ్లాడు. బంగారు నగలను తాకట్టు పెట్టే క్రమంలోనే పోలీసులు యాసర్‌ను అదుపులోకి తీసుకుని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ వార్తను కూడా చదవండి: Minister: యూపీ తరహాలో బుల్డోజర్‌ వాడే పరిస్థితి లేదు..


పట్టపగలే..

నగర శివారులోని టీచర్స్‌కాలనీలో ఒంటరిగా నివాసముంటున్న బొమ్మాళి సావిత్రమ్మ(63)ను ఈనెల ఆరో తేదీ పట్టపగలే గొంతుకోసి హత్య చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి 4గంటల మధ్యలో ఈ హత్య జరిగింది. సావిత్రమ్మ భర్త ఓబులేసు అటవీశాఖలో పనిచేస్తూ రిటైర్డ్‌ అయ్యారు. కొన్నేళ్ల కిందటే ఆయన మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటోంది. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్దకుమారుడు విజయ్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఆయన ప్రస్తుతం తన కుటుంబంతో కోవూరునగర్‌లో నివాసముంటున్నాడు.


pandu2.jpg

రెండో కుమారుడు జయకుమార్‌, కుమార్తె పూర్ణిమ అమెరికాలో ఉంటున్నారు. పెద్ద కుమారుడు విజయ్‌కుమార్‌(Vijaykumar) ఆరోతేదీ మధ్యాహ్నం తన తల్లికి భోజనం క్యారియర్‌ ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం 4.30గంటల సమయంలో ఇంట్లో పనులు చేయడానికి పనిమనిషి రమణమ్మ వచ్చింది. ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న సావిత్రమ్మను చూసి ఆందోళనతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వారు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సావిత్రమ్మ గతంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసినట్లు చెబుతున్నారు. 2015లో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం.


ఈవార్తను కూడా చదవండి: రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు

ఈవార్తను కూడా చదవండి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?

ఈవార్తను కూడా చదవండి: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే

Read Latest Telangana News and National News

Updated Date - Feb 15 , 2025 | 01:48 PM