Minister: యూపీ తరహాలో బుల్డోజర్ వాడే పరిస్థితి లేదు..
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:12 PM
పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసినవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హోం మంత్రి పరమేశ్వర్(Home Minister Parameshwar) తెలిపారు. మైసూరు నగరంలో హోం మంత్రి పరమేశ్వర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

- మైసూరులో పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులో 16 మంది అరెస్టు
- హోం మంత్రి పరమేశ్వర్
బెంగళూరు: పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసినవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హోం మంత్రి పరమేశ్వర్(Home Minister Parameshwar) తెలిపారు. మైసూరు నగరంలో హోం మంత్రి పరమేశ్వర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉదయగిరి పోలీస్ స్టేషన్ ఘటనకు సంబంధించి 16మందిని అరెస్టు చేశామని వెయ్యిమందిపై కేసు నమోదు చేశామని అయితే ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం తరహాలో బుల్‌డోజర్‌లు వాడేంతటి పరిస్థితి లేదన్నారు. ఎందుకు ఇటువంటి సంఘటన జరిగిందనేది ప్రాథమికంగా తెలుసుకునేందుకు వచ్చానన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: High Court: కులం.. అభివృద్ధికి ఆటంకం
ఇప్పటికే దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందన్నారు. మరింతమందిని అరెస్టు చేస్తామన్నారు. సీసీటీవీ ఫుటేజీలలోని ఫొటోలు, వీడియోల ఆధారంగా ఆరోపితులను గుర్తిస్తున్నామన్నారు. వైరల్ అయిన వీడియోలో ఏం ఉందనేది తెలుసుకుని అరెస్టు చేశామన్నారు. కాగా సీఎం సిద్దరామయ్య అధికారిక నివాసం కృష్ణలో మైసూరు సంఘటనపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. మైసూరు ఎస్పీ, నగర పోలీస్ కమిషనర్, డీజీపీతోపాటు పలువురు పాల్గొన్నారు.
తప్పు చేసినవారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామంటే ఉపేక్షించేది లేదని పోలీసులకు భరోసా ఇచ్చారు. అమాయకులకు ఇబ్బంది కలిగించరాదని సూచించారు. పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వినవారు, రెచ్చగొట్టినవారందరిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ఈవార్తను కూడా చదవండి: రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు
ఈవార్తను కూడా చదవండి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?
ఈవార్తను కూడా చదవండి: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే
Read Latest Telangana News and National News