ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. ఏమైందో తెలిస్తే..

ABN, Publish Date - Feb 04 , 2025 | 10:38 AM

ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు(Private Travels Bus) ఢీకొనగా భర్త మృతి చెందాడు. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆబిడ్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

- ప్రైవేట్‌ బస్సు ఢీకొని భర్త మృతి..

- భార్యకు తీవ్రగాయాలు

హైదరాబాద్: ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు(Private Travels Bus) ఢీకొనగా భర్త మృతి చెందాడు. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆబిడ్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆబిడ్స్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లాలగూడ(Lalaguda)కు చెందిన సంత జసంత ఆమె భర్త ఆడోమ్‌ క్యారమ్‌(67) బైక్‌పై బషీర్‌బాగ్‌ చౌరస్తా మీదుగా ఆబిడ్స్‌ ఛాపెల్‌రోడ్డులో వెళ్తుండగా ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన (ఎన్‌ఎల్‌ 01బీ2900) బస్సు అతివేగంగా రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీకొంది. ఎల్బీస్టేడియం, అగ్రికల్చర్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: నియోజకవర్గాన్ని ఆటల హబ్‌గా మారుస్తా..


పోలీసులు వచ్చి భార్యాభర్తలను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆడోమ్‌ క్యారమ్‌ మృతి చెందగా, అతని భార్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. సంత జసంత ఛాపెల్‌రోడ్‌లోని సెవెంత్‌ డే అడ్వెంటిస్ట్‌ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది. భార్యను స్కూల్‌లో దింపేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై మృతుడి కుమారుడు క్రిస్టోపర్‌ క్యారమ్‌ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, బస్సును అబిడ్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


ఈవార్తను కూడా చదవండి: KP Chowdary : నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: MLA Raj Gopal Reddy : మంత్రిని అడ్డుకున్నారన్న కేసు కొట్టివేయండి

ఈవార్తను కూడా చదవండి: Leopard: గ్రామ సింహం దెబ్బకు పరుగులు పెట్టిన చిరుత..

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 04 , 2025 | 10:38 AM