MLA: నియోజకవర్గాన్ని ఆటల హబ్‌గా మారుస్తా..
ABN , Publish Date - Feb 04 , 2025 | 10:08 AM
క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి, కుత్బుల్లాపూర్(Qutubullapur)ను ఆటల హబ్‌గా మారుస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) అన్నారు. జీడిమెట్ల డివిజన్‌లోని సెయింట్ మోసెస్ హైస్కూల్లో కుత్బుల్లాపూర్ మండలం స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లిటరరీ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ 2025ను ఎమ్మెల్యే, ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాలల చైర్మన్ మర్రి లక్ష్మారెడ్డిలు హాజరై ప్రారంభించారు.
- ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
హైదరాబాద్: క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి, కుత్బుల్లాపూర్(Qutubullapur)ను ఆటల హబ్‌గా మారుస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) అన్నారు. జీడిమెట్ల డివిజన్‌లోని సెయింట్ మోసెస్ హైస్కూల్లో కుత్బుల్లాపూర్ మండలం స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లిటరరీ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ 2025ను ఎమ్మెల్యే, ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాలల చైర్మన్ మర్రి లక్ష్మారెడ్డిలు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యమని అన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Mayor: అదుపు తప్పి పడిపోయిన మేయర్
స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సూచికగా బెలూన్లను గాలిలోకి వదలడంతో పాటు జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల విద్యాధికారి జెమినికుమారి, అసిస్టెంట్ ఎంఈఓ రమేష్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్‌ఎన్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు సీహెచ్ మల్లేశం, శివయ్య, నర్సిరెడ్డి, మహేష్, రవికుమార్, గోవర్ధన్ రెడ్డిలు పాల్గొన్నారు.
మరో కార్యక్రమంలో జీడిమెట్ల డివిజన్‌లోని దండమూడి ఎన్‌క్లేవ్‌లో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద గణేష్ నగర్ అమృతాలయం దశమ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రిక, పోస్టర్‌ను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు నర్శింహారెడ్డి, లింగం, భాస్కర్‌గౌడ్, సుదర్శన్‌లు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KP Chowdary : నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: MLA Raj Gopal Reddy : మంత్రిని అడ్డుకున్నారన్న కేసు కొట్టివేయండి
ఈవార్తను కూడా చదవండి: Leopard: గ్రామ సింహం దెబ్బకు పరుగులు పెట్టిన చిరుత..
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..
Read Latest Telangana News and National News