Home » Quthbullapur
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని హెచ్‌ఎంటీ అటవీ ప్రాంతం సినిమా షూటింగ్‌ల స్పాట్‌గా మారింది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం షూటింగ్‌లకు అనుకూలంగా ఉండడంతో వెబ్ సిరీస్ లు, ప్రైవేట్ ఆల్బమ్‌లు, చిన్నా, పెద్ద సినిమాలను ఇక్కడే తీస్తున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖం చాటేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ తరఫున బోరబండ డివిజన్ బాబాసైలానీ నగర్‌లో పార్టీ కార్యకర్తలతో కలిసి గురువారం రాత్రి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
వరదనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాజులరామారం డివిజన్ ఆదర్శనగర్ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరిందని తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం ఆ కాలనీకి వెళ్లి వరద నీటి సమస్యను పరిశీలించారు.
పేద ప్రజలపై అధికంగా ఆస్తిపన్నులు వేసి ఆర్ధిక భారం మోపొద్దని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు నర్సింహ, మల్లారెడ్డిలను ఆయన మంగళవారం కలిశారు.
వినాశనానికే విపరీత బుద్దులు అన్నట్లుగా.. ఓ వ్యక్తి.. మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడిని చంపేస్తామని, రూ.50లక్షలు ఇస్తే వదిలేస్తామంటూ బెదిరించి చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి, కుత్బుల్లాపూర్(Qutubullapur)ను ఆటల హబ్‌గా మారుస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) అన్నారు. జీడిమెట్ల డివిజన్‌లోని సెయింట్ మోసెస్ హైస్కూల్లో కుత్బుల్లాపూర్ మండలం స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లిటరరీ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ 2025ను ఎమ్మెల్యే, ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాలల చైర్మన్ మర్రి లక్ష్మారెడ్డిలు హాజరై ప్రారంభించారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(Kutubullapur MLA KP Vivekanand) పీఏ బండ మల్లేష్ పై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన్నే దామోదర్ ఈనెల 16వతేదీన జీడిమెట్ల(Jeedimetla) పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదుచేశారు.
నకిలీ రిజిస్ట్రేషన్ కేసులో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన వుజ్జిని జ్యోతిని జీడిమెట్ల పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
గాజులరామారంలో ఫీల్డ్ ఆఫీసర్ కిషన్ లీలలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళ పారిశుద్ద్య సిబ్బందిని లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధిత మహిళకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దాంతో బాధితురాలు మీడియా ముందుకు వచ్చి జరిగిన మొత్తం చెప్పింది. మహిళను వేధించిన ఫీల్డ్ ఆఫీసర్‌పై గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకున్నారు.