Share News

MLA: హామీలు నెరవేర్చలేక ముఖం చాటేస్తున్న సీఎం..

ABN , Publish Date - Oct 09 , 2025 | 10:54 AM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖం చాటేస్తున్నారని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్‌ తరఫున బోరబండ డివిజన్‌ బాబాసైలానీ నగర్‌లో పార్టీ కార్యకర్తలతో కలిసి గురువారం రాత్రి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

MLA: హామీలు నెరవేర్చలేక ముఖం చాటేస్తున్న సీఎం..

- కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖం చాటేస్తున్నారని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్‌ తరఫున బోరబండ డివిజన్‌ బాబాసైలానీ నగర్‌లో పార్టీ కార్యకర్తలతో కలిసి గురువారం రాత్రి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బస్తీలో ఇంటింటికీ తిరిగి ‘కాంగ్రెస్‌ బాకీ కార్డు’లను పంపిణీ చేసిన ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్‌ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్‌ చేసిన అభివృద్ధి గల్లీగల్లీలో కనిపిస్తోందని తెలిపారు. మాగంటి సతీమణి సునీత అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనేకమందికి మాగంటి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇప్పించడమే కాకుండా, బస్తీల్లో మౌలిక వసతులు కల్పించారని ప్రజలు చెబుతుంటే ఆనందంగా ఉందన్నారు.


city5.2.jpg

ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక మంత్రులను ప్రజల వద్దకు పంపుతున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు జూబ్లీహిల్స్‌ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ బోరబండ డివిజన్‌ అధ్యక్షుడు టి.కృష్ణమోహన్‌, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భారత్‌ దాల్‌.. అంతా గోల్‌మాల్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 09 , 2025 | 10:54 AM