Hyderabad: మావోయిస్టుల పేరుతో లేఖ.. అతడిని చంపేస్తామంటూ..
ABN , Publish Date - May 28 , 2025 | 09:14 AM
వినాశనానికే విపరీత బుద్దులు అన్నట్లుగా.. ఓ వ్యక్తి.. మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడిని చంపేస్తామని, రూ.50లక్షలు ఇస్తే వదిలేస్తామంటూ బెదిరించి చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడిని చంపేస్తామని బెదిరింపు
- రూ.50లక్షలు డిమాండ్
- జీడిమెట్ల పోలీసుల అదుపులో ఇద్దరు
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడిని చంపేస్తామంటూ కుత్బుల్లాపూర్(Qutubullapur)లో మావోయిస్టుల పేరుతో లేఖ బయటపడటం కలకలం రేపింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని షాపూర్‌నగర్ హెచ్‌ఎంటీ సొసైటీలో నివాసముంటున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్(Former MLA Kuna Srisailam Goud) సోదరుడు రవీందర్‌గౌడ్ ఇంటికి ఈనెల 21న రాత్రి గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి వేళ ఇంటి ఆవరణలోకి చొరబడ్డాడు. కారుపైన ఒక లేఖ పెట్టాడు.
ఇంటి ఎదుట ఉన్న తులసీ మొక్కను ధ్వంసం చేశాడు. ఎర్రరంగులో ఉన్న కండువాను కారుపై పెట్టి వెళ్లారని తెలిపారు. ఆ లేఖను రవీందర్‌గౌడ్ తన కుమారుడు రాఘవేంద్రగౌడ్‌కు చూపించాడు. అందులో తాము మావోయిస్టులమని, శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రూ. 50 లక్షలు పంపించకపోతే రాఘవేంద్రగౌడ్‌ను చంపేస్తామని రాసి ఉందని పోలీసులు తెలిపారు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సీసీ ఫుటేజీని పరిశీలించారు.
12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకున్న వ్యక్తి లోపలికి దూకినట్టుగా గుర్తించి, 22 కు ఫిర్యాదు చేశారని జీడిమెట్ల పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. కూన రవీందర్, రాఘవేందర్‌లు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలే బెదిరింపులకు కారణం పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: గుడ్ న్యూస్..వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు..
Miss World 2025: మిస్ వరల్డ్ ఫైనల్స్... 3 గంటలు.. 3500 మంది ప్రేక్షకులు
Read Latest Telangana News and National News