MLA: వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..
ABN , Publish Date - Aug 29 , 2025 | 09:23 AM
వరదనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాజులరామారం డివిజన్ ఆదర్శనగర్ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరిందని తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం ఆ కాలనీకి వెళ్లి వరద నీటి సమస్యను పరిశీలించారు.
- ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
హైదరాబాద్: వరదనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాజులరామారం డివిజన్ ఆదర్శనగర్ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరిందని తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం ఆ కాలనీకి వెళ్లి వరద నీటి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్(MLA Vivekanand) మాట్లాడుతూ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గత 12 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి వరద,
మురుగునీటి సమస్యలను పరిష్కరించామని, ఎత్తైన కాలనీల నుంచి వస్తున్న వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతోందని ఆయన అన్నారు. ఎస్‌ఎస్డీపీ పథకం కింద ఇప్పటికే అనేక నాలాలను అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో కూడా వర్షపు నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి యుద్ధప్రాతిపదికన

ఆదర్శనగర్ కాలనీలోని వరద నీటి సమస్యను పరిష్కరించడంతో పాటు సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గోపా ల్, ప్రధాన కార్యదర్శి సాగర్‌రావు, కోశాధికారి శ్రీకాంత్‌రెడ్డి, సలహాదారు దయాకర్, స్థానికులు కృష్ణ, గోపాల్‌రెడ్డి శ్రీనివా్‌సయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు
Read Latest Telangana News and National News