Hyderabad: సినీ షూటింగ్ స్పాట్‌గా హెచ్ఎంటీ ఫారెస్ట్
ABN , Publish Date - Oct 24 , 2025 | 09:57 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని హెచ్ఎంటీ అటవీ ప్రాంతం సినిమా షూటింగ్‌ల స్పాట్‌గా మారింది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం షూటింగ్‌లకు అనుకూలంగా ఉండడంతో వెబ్ సిరీస్ లు, ప్రైవేట్ ఆల్బమ్‌లు, చిన్నా, పెద్ద సినిమాలను ఇక్కడే తీస్తున్నారు.
- నటీ నటులను, సెట్లను చూసేందుకు తరలివస్తున్న ప్రజలు
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ(Qutubullapur Constituency) పరిధిలోని హెచ్ఎంటీ అటవీ ప్రాంతం(HMT Forest Area) సినిమా షూటింగ్‌ల స్పాట్‌గా మారింది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం షూటింగ్‌లకు అనుకూలంగా ఉండడంతో వెబ్ సిరీస్ లు, ప్రైవేట్ ఆల్బమ్‌లు, చిన్నా, పెద్ద సినిమాలను ఇక్కడే తీస్తున్నారు. తమ అభిమాన నటీ, నటులను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ఈ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంటోంది.

నాలుగు నెలల క్రితం మారేడుమిల్లి పోలీస్ స్టేషన్(Maredumilli Police Station), బకాసుర రెస్టారెంట్ సినిమాల షూటింగ్ హెచ్ఎంటీ ఫారెస్ట్ ప్రాంతం((HMT Forest Area))లో జరిగింది. తాజాగా లేడీ ఓరియెంటెడ్ సినిమా మైస షూటింగ్ జరిగింది. గురువారం అర్ధరాత్రి వరకు కొత్త బంగారు లోకం హీరో వరుణ్ సందేశ్, సత్యం రాజే్‌ష కలయికలో కొత్త సినిమాను శ్మశానవాటిక సెట్లో తీశారు. శ్మశానవాటికతో పాటు అక్కడ వేసిన కాటికాపరి గుడిసె, శివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉండడంతో ప్రజలు చూసేందుకు వస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం
విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం
Read Latest Telangana News and National News