Share News

Airline Safety: విమానాల్లో పవర్‌ బ్యాంకులపై నిషేధం

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:23 AM

దేశీయ విమానాల్లో పవర్‌ బ్యాంకులపై నిషేధం విధించడంపై పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) సమాలోచనలు జరుపుతోంది.

Airline Safety: విమానాల్లో పవర్‌ బ్యాంకులపై నిషేధం

  • విమానయాన భద్రతపై డీజీసీఏ సమాలోచనలు

న్యూఢిల్లీ, అక్టోబరు 23: దేశీయ విమానాల్లో పవర్‌ బ్యాంకులపై నిషేధం విధించడంపై పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) సమాలోచనలు జరుపుతోంది. ఆదివారం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుని పవర్‌ బ్యాంక్‌ నుంచి మంటలు చెలరేగాయి. క్యాబిన్‌ సిబ్బంది సత్వరమే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి నష్టమూ వాటిల్లలేదు. ఈ ఘటన తరువాత లిథియం బ్యాటరీలతో పనిచేసే పవర్‌ బ్యాంకులను విమానాల్లో తీసుకువెళ్లడం, వాటిని ఉపయోగించడం ఎంత వరకు క్షేమమన్న అంశంపై సమగ్ర పరిశీలన అవసరమైంది. ఈ నేపథ్యంలో డీజీసీఏ సమాలోచనల తరువాత పవర్‌ బ్యాంక్‌లపై పూర్తి నిషేధం లేదా వాటి వాడకంపై కఠిన నిబంధనలు అమలు కావచ్చని తెలుస్తోంది.

Updated Date - Oct 24 , 2025 | 06:24 AM