MLA: పేదలపై ఆస్తి పన్ను భారం తగ్గించాలి
ABN , Publish Date - Aug 27 , 2025 | 08:36 AM
పేద ప్రజలపై అధికంగా ఆస్తిపన్నులు వేసి ఆర్ధిక భారం మోపొద్దని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు నర్సింహ, మల్లారెడ్డిలను ఆయన మంగళవారం కలిశారు.
- ఎమ్మెల్యే వివేకానంద్
హైదరాబాద్: పేద ప్రజలపై అధికంగా ఆస్తిపన్నులు వేసి ఆర్ధిక భారం మోపొద్దని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) అన్నారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు నర్సింహ, మల్లారెడ్డిలను ఆయన మంగళవారం కలిశారు. జంట సర్కిళ్ల పరిధిలోని ఎన్‌టీఆర్ నగర్. బస్తీల్లో 60 గజాల ఇళ్లకు మూడేళ్ల ఆస్తి పన్నుపై పెనాల్టీలను రద్దు చేయాలని ఆయన కోరారు. కాలనీల్లో చాలా కాలం క్రితమే ఇళ్లు నిర్మించుకున్నారని, ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారు ఎక్కువగా పేదలు ఉన్నారని, వారికి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.

ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకుని ఆస్తిపన్నుపై వేస్తున్న అపరాధ రుసుంను మాఫీ చేయాలని కోరారు. ఈ సమస్యపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌కు ఫోన్ చేసి విరించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో కార్పొరేటర్ కొలుకుల జగన్, విజయ్‌శేఖర్‌గౌడ్, మంత్రి సత్యనారాయణ, నాయకులు మహ్మద్‌రఫీ, మన్నెరాజు, పుప్పాల భాస్కర్, గుబ్బల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు సంచలన లేఖ
Read Latest Telangana News and National News