ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Inspector: నిన్ను కూడా లోపల వేస్తా..

ABN, Publish Date - Jun 30 , 2025 | 08:34 AM

బస్తీ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల అంశంపై తలెత్తిన చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది. బోరబండ ఠాణా వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.పెద్ద ఎత్తున ఎన్‌ఎస్యూఐ, కాంగ్రెస్‌ శ్రేణులు ఠాణా వద్దకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

- ఎన్‌ఎస్యూఐ అధ్యక్షుడిని ఫోన్‌లో హెచ్చరించిన ఇన్‌స్పెక్టర్‌

- బోరబండ ఠాణాకు అధికసంఖ్యలో యూత్‌, కాంగ్రెస్‌ శ్రేణులు

- స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్‌

హైదరాబాద్: బస్తీ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల అంశంపై తలెత్తిన చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది. బోరబండ ఠాణా వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.పెద్ద ఎత్తున ఎన్‌ఎస్యూఐ, కాంగ్రెస్‌ శ్రేణులు ఠాణా వద్దకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఠాణాలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జి చేశారు. ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు ఉద్రిక్తత సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..

రహ్మత్‌నగర్‌ డివిజన్‌ ఎస్పీఆర్‌ హిల్స్‌ టి.అంజయ్యనగర్‌ బస్తీ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. బస్తీకి ఎన్నికలు నిర్వహించాలని ఎన్‌ఎస్యూఐ నాయకుడు, స్థానికుడు శివ డిమాండ్‌ చేశారు. అయితే తాను బస్తీకి అధ్యక్షురాలిగా కొనసాగుతుండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటూ ఆండాళు అభ్యంతరం వ్యక్తం చేశారు. బస్తీ వాసులను తప్పుదోవ పట్టించేలా సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలో మాటా మాటా పెరిగడంతో శివపై.. ఆండాళు బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శివను ఠాణాకు తరలించారు. తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని శివ ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామికి ఫోన్‌చేసి చెప్పాడు. దీంతో వెంకటస్వామి ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌గౌడ్‌కు ఫోన్‌ చేసి శివ విషయం అడిగాడు. ‘స్టేషన్‌కు వస్తే నిన్ను కూడా లోపలేస్తా..’ అంటూ ఇన్‌స్పెక్టర్‌ అతనిపై మండిపడ్డారు. ‘‘నేను స్టేషన్‌కు వస్తాను ఎలా అరెస్టు చేస్తారో చూస్తా.. అంటూ’’ వెంకటస్వామి ఆ సమాచారాన్ని తన శ్రేణులకు చేరవేశారు. దీంతో సాయంత్రం కల్లా పెద్దఎత్తున ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు బోరబండ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.

లాఠీచార్జ్‌

వెంకటస్వామి ఠాణాలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. అయినా పోలీసులను నెట్టుకుంటూ దాదాపు రెండువందల మంది పోలీస్‏స్టేషన్‌లోకి చొచ్చుకొని పోయారు. ఆ సమయంలో ఠాణాలో ఇన్‌స్పెక్టర్‌ లేరు. ఎస్‌ఆర్‌నగర్‌ డివిజన్‌ ఏసీపీ రాఘవేంద్రరావు అక్కడకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు.

కొద్దిసేపటికి అక్కడకు చేరుకున్న ఇన్‌స్పెక్టర్‌తో కలిసి ఎన్‌ఎస్‏యూఐ నాయకులతో ఏసీపీ చర్చలు జరిపారు. అనంతరం వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ శివకు సంబంధించిన సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. తాము ఠాణా ముట్టడికి రాలేదని, రాష్ట్ర నాయకుడిని కాబట్టి తమ కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చారని వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్ న్యూస్.. రూ.98 వేల దిగువకు బంగారం.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎంపీ రఘునందన్‌కు మళ్లీ బెదిరింపు కాల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jun 30 , 2025 | 08:34 AM