ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US: ఇరుగుపొరుగు వారి ఫిర్యాదుతో బయటపడ్డ దారుణం.. వృద్ధురాలిపై పోలీసుల దర్యాప్తు

ABN, Publish Date - May 16 , 2025 | 06:21 PM

తొమ్మిది నెలలుగా కొడుకు మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్న ఓ వృద్ధురాలి ఉదంతం అమెరికాలో వెలుగు చూసింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

US woman living with her deceased sons remains

ఇంటర్నెట్ డెస్క్: ఆమె ఓ డాక్టర్.. వృద్ధాప్యం మీదపడింది. డాక్టర్ లైసెన్సు కూడా రద్దు చేశారు. అయితే, చెత్తకుప్పగా మారిన ఆమె ఇంటిని చూసి ఇరుగుపొరుగు వారికి ఛీదర పుట్టింది. చివరకు వారు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం కలిగిస్తోంది.

న్యూఆర్లీన్స్ రాష్ట్రంలో ఈ ఘటన వెలుగు చూసింది. బార్బరా హెయిన్స్ అనే వృద్ధురాలు తన కొడుకు మృతదేహాన్ని 9 నెలలుగా ఇంట్లోనే పెట్టుకున్నట్టు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఇల్లంతా చెత్తాచెదారంతో రోత పుట్టేలా మారడంతో ఇరుగుపొరుగు వారు తొలుత మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అధికారులు ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.


వృద్ధురాలిపై గతంలో కూడా ఇరుగుపొరు పలు ఫిర్యాదులు దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమె ఇంటికి వెళ్లిన అధికారులు అక్కడి దుర్భర పరిస్థితులు చూసి షాకైపోయారు. ఇల్లంతా చెత్తతో నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా ఎలుకలు, పురుగులు కనిపించాయి. ఓ చోట ఆమె కొడుకు పార్థివదేహం కనిపించింది. ఆ మృతదేహం తన కొడుకుదని మహిళ స్వయంగా పోలీసులకు చెప్పింది. పలు రకాల అనారోగ్యాలతో అతడు మరణించినట్టు పేర్కొంది. మృతురాలికి మతిస్థిమితం తప్పి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.


మరోవైపు, మహిళ ఇంటి పరిసరాలను శానిటైజ్ చేసేందుకు స్థానిక అధికారులు ఓ కాంట్రాక్టర్‌ను కూడా రంగంలోకి దింపారు. శిథిలావస్థకు చేరుకున్న ఆమె ఇంటిని కూడా కూల్చేయాలా వద్దా అనే విషయంలో తర్జనభర్జనలు పడుతున్నారు. అంతకుమునుపే.. మహిళపై అధికారులు దృష్టి సారించారు. ఆమె ఇల్లు పబ్లిక్ న్యూసెన్స్‌గా మారినట్టు తీర్మానించారు. 6 వేల డాలర్ల జరిమానా కూడా విధించారు. ఇంతలోనే ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

నడిరోడ్డులో బెంగళూరు మహిళకు వేధింపులు.. సాయం అడిగినా పట్టించుకోని జనాలు

ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు

మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్

తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..

Read Latest and Crime News

Updated Date - May 16 , 2025 | 06:51 PM