ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mumbai: అలర్ట్.. లీటర్ పాలకు ఆర్డర్ పెట్టేందుకు ట్రై చేస్తే.. ఏకంగా రూ.18.5 లక్షల లాస్

ABN, Publish Date - Aug 17 , 2025 | 04:10 PM

సైబర్ స్కామ్ బారిన పడ్డ ఓ ముంబై వృద్ధురాలు తన సొమ్మంతా పోగొట్టుకున్నారు. నిందితుడు ఫోన్‌కు పంపించిన లింక్‌పై క్లిక్ చేసిన ఫలితంగా మళ్లీ కోలుకోలేని స్థాయిలో డబ్బు నష్టపోయారు. పాలకు ఆర్డర్ పెట్టడంలో సాయం చేస్తానని చెప్పిన నిందితుడు మహిళ సొమ్మును కాజేశాడు.

Mumbai Online Scam Elderly Woman

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగే కొద్దీ మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ మోసాలపై అవగాహన లేని వారు దారుణంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు జీవిత చరమాంకంలో తాము కూడపెట్టుకున్నదంతా కోల్పోయి లబోదిబోమంటున్నారు. ఇందుకు తాజాగా ఉదాహరణగా ముంబైలో ఓ షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ ఓ వృద్ధురాలు ఏకంగా రూ.18.5 లక్షలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, 71 ఏళ్ల వయసున్న ఆ బాధితురాలికి ఇటీవల ఓ సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. పాల కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్‌నంటూ తనని తాను పరిచయం చేసుకున్న అతడు ఆన్‌లైన్‌లో పాలు బుక్ చేయిస్తానంటూ నమ్మబలికాడు. వృద్ధురాలి బ్యాంకింగ్ వివరాలను ఆరా తీశాడు. అయితే, ఈ మోసాల గురించి ఏమాత్రం అవగాహన లేని బాధితురాలు అతడు అడిగిన వివరాలను చెప్పింది. బ్యాకింగ్ వివరాలను కూడా వెల్లడించింది. నిందితుడు తన ఫోన్‌కు పంపించిన లింక్‌పై క్లిక్ చేసి అతడు కోరిన వివరాలను నింపింది. దాదాపు గంట పాటు అతడితో మాట్లాడుతూ తన వివరాలు తెలిపింది.

ఆ తరువాత నిందితుడు మరుసటి రోజు మళ్లీ కాల్ చేశాడు. ఈసారి బాధితురాలి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాడు. ఇదంతా పాలకు ఆర్డర్ పెట్టడంలో భాగమేనని నమ్మిన బాధితురాలు మళ్లీ అతడు అడిగిన వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పేసింది. ఆ తరువాత వృద్ధురాలి అకౌంట్‌లలోంచి మొత్తం సొమ్ము అంతా ఆమెకు తెలియకుండానే నిందితుడికి బదిలీ అయిపోయింది.

ఇది జరిగిన కొన్నాళ్లకు వద్ధురాలు ఏదో పని మీద బ్యాంకుకు వెళ్లగా ఆమె అకౌంట్‌లో ఉండాల్సిన రూ.1.7 లక్షలను ఎవరో డ్రా చేసినట్టు తెలిసింది. తన మిగిలిన రెండు అకౌంట్‌లను చెక్ చేయగా వాటిల్లోని మొత్తం రూ.18.5 లక్షల సోమ్ము కూడా బదిలీ అయినట్టు తెలియడంతో ఆమె నమ్మలేకపోయింది. జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము మటుమాయం కావడంతో నోటమాటరాలేదు.

సైబర్ నేరగాళ్లు పంపించిన లింక్‌ను క్లిక్ చేయడంతో ఆమె ఫోన్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ నేరగాడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్, ఈమెయిల్స్ ద్వారా వచ్చే లింక్స్ జోలికి వెళ్లొద్దని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

సోదరి వరసయ్యే బాలికపై అత్యాచారం.. రాఖీ కట్టిన కొన్ని గంటలకే దారుణం

ఫేస్‌బుక్ లైమ్ స్ట్రీమ్ చేస్తుండగా హత్య.. నడి వీధిలో దారుణం.. వీడియో వైరల్

For More National News and Telugu News

Updated Date - Aug 17 , 2025 | 04:23 PM