Chicago Shooting Incident: ఫేస్‌బుక్ లైమ్ స్ట్రీమ్ చేస్తుండగా హత్య.. నడి వీధిలో దారుణం.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 15 , 2025 | 06:15 PM
తన కారులో కూర్చుని ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమ్ చేస్తున్న ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కాల్పులు జరిపి హత్య చేసిన దారుణ ఘటన అమెరికాలోని చికాగో నగరంలో వెలుగు చూసింది. ఈ దారుణ ఘటన తాలుకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన కారులో కూర్చుని ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మృతుడిని చికాగోకు చెందిన 42 ఏళ్ల కెవిన్ వాట్సన్‌గా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ కెవిన్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, కెవిన్ తన బంధువు వద్దకు వెళుతున్న సమయంలో ఈ దారుణం జరిగింది. అతడు కారులో కూర్చుని ఫేస్‌బుక్ ద్వారా లైస్ట్రీమింగ్ చేస్తున్నాడు. వాహన పార్కింగ్ సమస్యకు సంబంధించి ఏదో చెబుతున్నాడు. ఆ లైవ్ స్ట్రీమ్‌ను కెవిన్ బంధువులు కూడా చూడసాగారు. ఇంతలో కెవిన్ కారు పక్కకు ఓ కారు వచ్చిన ఆగింది. కారులోని వ్యక్తిని చూడగానే కెవిన్ బెదిరిపోయాడు. అతడితో ఏదో మాట్లాడుతూ కారు దిగాడు. ఆ తరువాత కొన్ని క్షణాలకు తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. వద్దు వద్దు అని కెవిన్ అన్న మాటలు వీడియోలో రికార్డు అయ్యాయి.
కెవిన్ ఛాతికి తూటా తగిలిందని స్థానిక పోలీసులు తెలిపారు. వెంటనే అతడిని మౌంట్ సినాయ్ ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే, నిందితుడు కెవిన్‌కు పరిచయస్థుడే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి చేతిలోంచి తుపాకీ లాక్కునేందుకు కెవిన్ ప్రయత్నించిన సందర్భంలో తూటా పేలి అతడు నేలకొరిగాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తూటా తగలగానే నేలకొరిగిన కెవిన్ ఆ తరువాత శ్వాశ తీసుకోలేక తెగ ఇబ్బంది పడ్డాడని అతడి బంధువు మీడియాకు తెలిపింది. కెవిన్ మంచి వ్యక్తి అని, అతడిని హత్య చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. కెవిన్‌కు ఆరేళ్ల కూతురు కూడా ఉంది.
అయితే, ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. హత్యకు కారణం ఏంటో కూడా ఇంకా తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
సోదరి వరసయ్యే బాలికపై అత్యాచారం.. రాఖీ కట్టిన కొన్ని గంటలకే దారుణం
ట్రంప్ అతి పెద్ద క్రిమినల్.. గ్రోక్ చాట్‌బాట్ సంచలన స్టేట్‌మెంట్
For More National News and Telugu News