ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mumbai: భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

ABN, Publish Date - Jun 01 , 2025 | 09:01 AM

భార్య శృంగారానికి ఒప్పుకోకపోవడంతో రెచ్చిపోయిన ఓ వ్యక్తి ఆమెకు నిప్పు పెట్టాడు. ముంబైలో వెలుగు చూసిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Mumbai

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భార్య తన కోరిక తీర్చలేదన్న కోపంలో రెచ్చిపోయిన ఓ వ్యక్తి ఆమె ఒంటికి నిప్పుపెట్టాడు. చెంబూర్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బాధితురాలు పనిమనిషిగా చేస్తోంది. తనకు ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో భర్త దినేశ్ అవ్హాద్ కోరికను నిరాకరించింది. దీంతో, ఇద్దరి మధ్యా వాగ్వాదం మొదలైంది. కోపంలో ఆమె తన ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. ఆమె అగ్గిపుల్ల వెలిగించేందుకు ప్రయత్నించినా కుదరలేదు.

ఈలోపు దినేశ్ దారుణానికి తెగబడ్డాడు. గ్యాస్ స్టవ్‌తో ఓ కాగితాన్ని వెలిగించి ఆమెపై విసిరేశాడు. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసి పడటంతో మంటల్లో చిక్కుకున్న ఆమె తీవ్ర గాయాల పాలైంది. బాధితురాలిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్టు పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు దినేశ్‌పై హత్యాయత్నం, ఇతర నేరాల కింద కేసు నమోదు అరెస్టు చేశారు.


కాగా, యూపీలో ఇటీవల వెలుగు చూసిన మరో ఘటనలో.. ఓ యువతి పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త, మామ, మరదలే కారణమని ఓ వీడియో కూడా రికార్డు చేసి బలవన్మరణానికి పాల్పడింది. మొరాదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. గర్భస్రావం అయ్యాక తనకు అత్తింటి ఆరళ్లు ఎక్కువైపోయాయని ఆమె వీడియోలో తెలిపింది. మామ, మరదలు తనను వేధిస్తున్నా భర్త పట్టించుకోలేదని పేర్కొంది. నువ్వెందుకు చావవు అంటూ తననే తిట్టిపోశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఆత్మహత్యే శరణ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కన్నీరుమున్నీరయ్యింది. తన చావుకు భర్త కూడా బాధ్యుడే అని తేల్చి చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

టీనేజర్ ఘాతుకం.. స్కూల్ ఫీజు అడిగితే ఇవ్వలేదని బామ్మను రాత్రి వేళ

Read Latest and Crime News

Updated Date - Jun 01 , 2025 | 09:10 AM