Share News

Teen Kills Grandmother: టీనేజర్ ఘాతుకం.. స్కూల్ ఫీజు అడిగితే ఇవ్వలేదని బామ్మను రాత్రి వేళ..

ABN , Publish Date - May 24 , 2025 | 12:56 PM

స్కూలు ఫీజు విషయంలో ఓ టీనేజర్ తన బామ్మతో గొడవ పడి ఆ తరువాత హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.

Teen Kills Grandmother: టీనేజర్ ఘాతుకం.. స్కూల్ ఫీజు అడిగితే ఇవ్వలేదని బామ్మను రాత్రి వేళ..
Teen Kills Grandmother

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్కూల్ ఫీజు విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ టీనేజర్ తన బామ్మను రాత్రి వేళ హత్య చేశాడు. ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. లఖ్నవూలోని మలీహాబాద్‌లో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, వృద్ధురాలి కొడుకు పోయి పదేళ్లు అవుతోంది. ఆ తరువాత కోడలు కూడా వెళ్లిపోయింది. దీంతో, ఆమె మనవడితో కలిసి ఇంట్లో ఉంటోంది. ఆమె మనవడు స్థానిక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అంతకుముందు వారం పాటు అతడు తన బంధువుల ఇంట్లో ఉండి బుధవారమే తిరిగి వచ్చాడు.

ఈ క్రమంలోనే స్కూల్ ఫీజు విషయంలో బామ్మామనవళ్ల మధ్య వివాదం తలెత్తింది. తను స్కూలు ఫీజు ఇవ్వాలంటే మనవడు తన ఇంట్లోనే ఉండాలని వృద్ధురాలు కండీషన్ పెట్టింది. దీంతో, టీనేజర్ ఆమెను కిందపడేలా తోయడంతో గాయాలు కూడా అయ్యాయి. ఆ రాత్రే బాలుడు వృద్ధురాలిని హత్య చేశాడు. ఆమె నిద్రలో ఉండగా దిండును ఆమె ముఖంపై అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. రాత్రంతా ఆమె పక్కనే పడుకున్నాడు. మరుసటి రోజు ఏమీ జరగనట్టు స్కూలుకు వెళ్లిపోయాడు.


ఈలోపు వృద్ధురాలి కుమార్తె తన తల్లికి పలు మార్లు ఫోన్ చేసింది. ఎంతగా ప్రయత్నించినా తల్లి నుంచి స్పందన లేకపోవడంతో కంగారు పడ్డ ఆమె తన పక్కింటి వారికి ఫోన్ చేసింది. తల్లి ఎలా ఉందో కనుక్కోమని అభ్యర్థించింది.

దీంతో, పొరుగింటి మహిళ వచ్చి చూడగా వృద్ధురాలు మంచంలో అచేతనంగా కనిపించింది. వెంటనే అక్కడకు చేరుకున్న వృద్ధురాలి కూతురు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. .


ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టు మార్టం నివేదికతో పాటు ఫారెన్సిక్ ఆధారాలను కూడా సేకరించారు. ఇక స్కూల్ నుంచి తిరిగొచ్చిన బాలుడిని కూడా ప్రశ్నించగా అతడు చేసిన నేరాన్ని అంగీకరించాడు. ‘‘బాలుడిని జువెనైల్‌ హోంకు తరలిస్తామని ఎస్‌హెచ్‌‌ఓ భాటీ తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే బాలుడు హత్య తరువాత తన బామ్మ మృతదేహం వద్దే ఉండి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

నడిరోడ్డులో బెంగళూరు మహిళకు వేధింపులు.. సాయం అడిగినా పట్టించుకోని జనాలు

Read Latest and Crime News

Updated Date - May 24 , 2025 | 01:56 PM