Screwdriver Attack: ప్రేమించడం లేదని యువతిని స్క్రూడ్రైవర్‌తో హత్య చేసిన యువకుడు
ABN, Publish Date - Jun 02 , 2025 | 09:15 PM
ఓ యువతిని ఓ స్థానిక యువకుడు ప్రేమించాలని పదే పదే కాల్ చేస్తూ వెంటపడ్డాడు. ఆ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి మరో వ్యక్తితో కొట్టించింది. దీంతో కోపంతో ఊగిపోయిన యువకుడు ఆమెను దారుణంగా (Screwdriver Attack) హత్య చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) మొరాదాబాద్‌లోని కోట్వాలీ మైనాథర్ గ్రామంలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం రోజు గడ్డి కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఒక యువతి సైరా, మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. ఆమె రక్తమోడిన శరీరం, అనేక గాయాలతో ఆదివారం రోజు ఓ పొలంలో కనిపించింది. ఈ హత్య వెనుక దారుణమైన (Screwdriver Attack) విషయం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
సైరా ఆచూకీ కోసం వెళ్లగా
సైరా శనివారం సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె కుటుంబం ఆందోళన చెందింది. ఆమె కోసం గ్రామంలోని ప్రతి చోటా వెతికినా ఆమె జాడ దొరకలేదు. ఆ తర్వాత ఆదివారం ఉదయం, కుటుంబ సభ్యులు పొలాల్లో వెతకడం ప్రారంభించగా, సైరా శరీరం రక్తంతో తడిసిన స్థితిలో, అనేక గాయాలతో కనిపించింది. ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలో అత్యాచారం జరిగిందని అనుమానాలకు దారితీసింది.
మిస్డ్ కాల్స్
ఆ క్రమంలో ఆమె బాడీని పోస్టుమార్టం నిర్వహించగా అత్యాచారం జరగలేదని తేలింది. కానీ ఆమె శరీరంపై స్క్రూడ్రైవర్‌తో దాదాపు 18 సార్లు గాయాలు చేశారని పోస్ట్‌మార్టం నివేదిక స్పష్టం చేసింది. ఆ క్రమంలో సైరా మొబైల్ చెక్ చేయగా ఐదు మిస్డ్ కాల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కాల్స్ ఆమె గ్రామంలోనే నివసించే రఫీ అనే వ్యక్తి నుంచి వచ్చినట్లు గుర్తించారు. సైరా తల్లి సఫీనా పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం, రఫీ తన కూతురిని తరచూ వేధించేవాడని తెలిపింది.
విచారణలో షాకింగ్ విషయాలు
దీంతో, పోలీసులు రఫీని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో రఫీ తానే సైరాను హత్య చేశానని ఒప్పుకున్నాడు. రఫీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, తాను సైరాను ప్రేమిస్తున్నానని, కానీ ఆమె తన ప్రేమను తిరస్కరించిందని చెప్పాడు. కొన్ని రోజుల క్రితం, సైరా గ్రామంలోని మరో వ్యక్తితో కలిసి తనను కొట్టించిందన్నాడు. ఆమె ఆ వ్యక్తితో సంబంధంలో ఉందని రఫీ అనుమానించాడు. ఈ కసితో రఫీ ఆమెపై పగను పెంచుకున్నాడు. ఆ తర్వాత రెండు రోజుల పాటు సైరాను వెంబడించాడు.
పోలీసుల చర్యలు
శనివారం రోజు ఆమెకు అనేక సార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఆ సమయంలో పొలంలో ఒంటరిగా ఉన్న ఆమెను స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు గాయపరిచి హత్య చేశాడు. ఆమె మరణించిన తర్వాత, రఫీ ఇంటికి వెళ్లి స్నానం చేసి, బట్టలు మార్చుకుని నిద్రపోయాడు. రఫీని అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ హత్య గ్రామంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది.
ఇవీ చదవండి:
ఐదేళ్ల క్రితం స్టాక్ ధర రూ.129, ఇప్పుడు రూ.1679
ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటాం..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 09:15 PM