Bengaluru: 24 గంటల్లో పేల్చేస్తాం.. భట్కళ్‌ను నాశనం చేస్తామంటూ బెదిరింపులు
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:39 PM
ఉత్తరకన్నడ జిల్లా ఓడరేవుకు అనుబంధమైన భట్కళ్‌ను 24 గంటల్లో పేల్చివేస్తామని మెయిల్ ద్వారా సందేశం పంపిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈనెల 10న ఉదయం 7.23 గంటలకు పోలీస్ స్టేషన్‌కు ఓ మెయిల్ వచ్చిందని ఉత్తరకన్నడ ఎస్పీ ఎం నారాయణ్ తెలిపారు.
- మెయిల్ చేసిన్ ఖలీద్ అరెస్టు
బెంగళూరు: ఉత్తరకన్నడ జిల్లా ఓడరేవుకు అనుబంధమైన భట్కళ్‌ను 24 గంటల్లో పేల్చివేస్తామని మెయిల్ ద్వారా సందేశం పంపిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈనెల 10న ఉదయం 7.23 గంటలకు పోలీస్ స్టేషన్‌కు ఓ మెయిల్ వచ్చిందని ఉత్తరకన్నడ ఎస్పీ ఎం నారాయణ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 40ఏళ్ల నితిన్ అలియాస్ ఖలీద్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.
మైసూరు సెంట్రల్ జైలు(Mysoor Central Jail)లో ఖలీద్ నిందితుడిగా ఉన్నాడన్నారు. ఇతను ఢిల్లీ వాసి కాగా పలు కేసులు ఉన్నాయన్నారు. ఇతను నితిన్ శర్మ అలియాస్ ఖలీద్‌గా కొనసాగుతున్నాడన్నారు. కేరళలో 6, కర్ణాటకలో 3, పుదుచ్చేరిలో 2, ఢిల్లీ మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశ్శా, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కో కేసు ఉందన్నారు. ఏడాదిగా ఇతను జైలులో ఉన్నాడని, తప్పుడు సమాచారంతో బాంబులు పెట్టి పేల్చివేస్తామని బెదరిస్తుంటారన్నారు.
తమిళనాడుకు చెందిన కణ్ణన్ గురుస్వామి మొబైల్ ద్వారా మెయిల్ చేసినట్టు గుర్తించామన్నారు. కేరళ మున్నార్ పోలీసులు ఓ మోసం కేసులో కణ్ణన్ గురుస్వామిని విచారణకు తీసుకొచ్చారన్నారు. అదే పోలీ్‌సస్టేషన్‌లో ఖలీద్‌ను బాడీ వారెంట్‌పై తీసుకెళ్లారన్నారు. ఇద్దరూ ఒకే బ్యారక్‌లో ఉన్నప్పుడు గురుస్వామి మొబైల్ ద్వారా మెయిల్ చేసి బెదరించారన్నారు. అతడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య
Read Latest Telangana News and National News
Updated Date - Jul 15 , 2025 | 12:39 PM