ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆన్‌లైన్‌ జూదంలో రూ.15 లక్షల నష్టం.. యువకుడి ఆత్మహత్య

ABN, Publish Date - Jul 15 , 2025 | 11:42 AM

ఆన్‌లైన్‌ జూదంలో నగలు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మదురై జిల్లాలో చోటుచేసుకుంది. సిల్లాంపట్టి ప్రాంతానికి చెందిన చిన్నరాజా (35) డైవింగ్‌ శిక్షణ సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. చిన్నరాజాకు రూపవతి అనే భార్య, ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు.

చెన్నై: ఆన్‌లైన్‌ జూదంలో నగలు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మదురై జిల్లాలో చోటుచేసుకుంది. సిల్లాంపట్టి(Sillampatti) ప్రాంతానికి చెందిన చిన్నరాజా (35) డైవింగ్‌ శిక్షణ సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. చిన్నరాజాకు రూపవతి అనే భార్య, ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు.

చిన్నరాజా కొద్దినెలలుగా ఆన్‌లైన్‌ జూదం ఆడుతూ సుమారు రూ.15 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండడంతో, రెండు రోజుల క్రితం అతడు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతడి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది.

ఈ నేపథ్యంలో, ఉసిలంపట్టి సమీపంలో రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం ఉండడంతో అక్కడకు వెళ్లి పరిశీలించిన పోలీసులు, ఆ మృతదేహం చిన్నరాజాగా గుర్తించారు.అప్పుల బాధతో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య

Read Latest Telangana News and National News

Updated Date - Jul 15 , 2025 | 11:42 AM