Woman Throws Chilli: భార్య దారుణం.. భర్త కంట్లో కారం కొట్టి.. కాలితో గొంతు నొక్కి..
ABN, Publish Date - Jun 28 , 2025 | 09:22 PM
Woman Throws Chilli: శంకరమూర్తి శవాన్ని ఇద్దరూ కలిసి ఓ గోనె సంచిలో కుక్కారు. దాన్ని 30 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చారు. దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలో ఉన్న బావిలో పడేశారు.
భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. తాజాగా, ఓ భార్య తన భర్తను అతి కిరాతకంగా చంపేసింది. కంట్లో కారం కొట్టి, కాలితో గొంతు నొక్కి చంపేసింది. ఈ సంఘటన కర్ణాటకలోని తుమ్కూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం, తుమ్మూరు జిల్లా, తిప్తూరు తాలూకా, కడశెట్టిహళ్లి గ్రామానికి చెందిన 50 ఏళ్ల శంకర మూర్తి, సుమంగళ భార్యాభర్తలు. వీరికి పెళ్లై పదేళ్లుపైనే అవుతోంది.
సుమంగళ తిప్తూరులోని కల్పతరు బాలికల హాస్టల్‌లో వంట మనిషిగా పని చేస్తోంది. ఆమె గత కొంతకాలం నుంచి నాగరాజు అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి శంకరమూర్తి అడ్డుగా ఉన్నాడని వారు భావించారు. ఈ నేపథ్యంలోనే అతడ్ని చంపేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ 24వ తేదీన శంకరమూర్తి హత్యకు రంగం సిద్ధం చేశారు. నాగరాజు, సుమంగళ కలిసి శంకరమూర్తిపై దాడికి దిగారు. సుమంగళ భర్త కళ్లలో కారం చల్లింది. తర్వాత గొంతు మీద కాలేసి తొక్కి చంపేసింది.
శంకరమూర్తి శవాన్ని ఇద్దరూ కలిసి ఓ గోనె సంచిలో కుక్కారు. దాన్ని 30 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చారు. దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలో ఉన్న బావిలో పడేశారు. శంకరమూర్తి కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే శంకరమూర్తి ఇంటికి వెళ్లి సోదాలు చేయగా..
అతడి బెడ్ దగ్గర కారం పొడి.. శంకరమూర్తి ప్రాణాల కోసం పోరాటం చేసిన గుర్తులు లభించాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. సుమంగళను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె కాల్ డేటాను కూడా సేకరించారు. మర్డర్ విషయం బయటపడింది. తర్వాత ఆమె కూడా భర్తను మర్డర్ చేసినట్లు ఒప్పుకుంది. సుమంగళతో పాటు ఆమె ప్రియుడు నాగరాజును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం
పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..
Updated Date - Jun 28 , 2025 | 09:51 PM