Bengaluru News: దర్శకుడి కుటుంబ సభ్యులపై వరకట్నం కేసు నమోదు
ABN, Publish Date - Sep 12 , 2025 | 01:49 PM
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు ఎస్ నారాయణ్‌తో పాటు భార్య, కుమారుడిపై వరకట్నం కేసు నమోదయ్యింది. జ్ఞానభారతి పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నారాయణ్ రెండవ కుమారుడు పవన్ భార్య పవిత్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు ఎస్ నారాయణ్(Director S Narayan)తో పాటు భార్య, కుమారుడిపై వరకట్నం కేసు నమోదయ్యింది. జ్ఞానభారతి పోలీసుస్టేషన్(Gnanabharti Police Station)లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నారాయణ్ రెండవ కుమారుడు పవన్ భార్య పవిత్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు పవిత్రా ఫిర్యాదులో పేర్కొన్న మేరకు 2021లో పవన్, పవిత్రాల వివాహం జరిగింది. వివాహం వేళ లక్ష రూపాయల నగదు, ఉంగరంతో పాటు పెళ్ళి ఖర్చులు మా తల్లిదండ్రులే భరించినట్లు పేర్కొన్నారు.
పెళ్ళి జరిగిన మూడునెలల నుంచే ఇంట్లో ప్రతి విషయానికి గొడవలు చేశారన్నారు. అత్త, మావలు నోటికొచ్చినట్లు తిట్టేవారని దీంతో కలిసి ఉండలేక 2022లో భర్తతో కలిసి వేరు కాపురం పెట్టినట్లు పేర్కొన్నారు. పవన్ డిగ్రీ చదివినా ఉద్యోగం లేక పోవడంతో కుటుంబ అవసరానికి ఖర్చులు తల్లిదండ్రులే భరించారన్నారు. ఇదే తరుణంలోనే కారు కొనుగోలు చేసేందుకు నా డబ్బులు లక్ష రూపాయలు ఇచ్చానని, మా అమ్మ నుంచి పవన్ మరో రూ.75వేలు తీసుకున్నారన్నారు.
మాకు కుమారుడు పుట్టిన మూడునెలలకు అత్తమావలు మరోసారి మా ఇంట్లోనే కలసి ఉండాలని కోరిన మేరకు వాపసు వెళ్ళామన్నారు. తిరిగి మామ ఇంటికి వెళ్ళాక అత్తమామలతో పాటు భర్త కూడా నిత్యం వేధించారన్నారు. మామ నారాయణ్ కళాసామ్రాట్ టీం అకాడమీ అనే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించేందుకు డబ్బులు కోరగా మా తల్లిదండ్రులు బంగారం తాకట్టు పెట్టి పదిలక్షలు ఇచ్చారన్నారు. మరలా డబ్బులు తీసుకురావాలని కోరుతూ ఇబ్బంది పెడుతున్నారని ఇంటి నుంచి బయటకు పంపేశారన్నారు. ఆత్మరక్షణకు ఫిర్యాదు చేయాల్సి వచ్చినట్లు పవిత్రా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 12 , 2025 | 01:49 PM