ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: రూ.8.13 లక్షలకు కుచ్చుటోపీ పెట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Feb 07 , 2025 | 10:45 AM

ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) అమాయకులను నిలువునా మోసగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సోలార్‌ ప్రాజెక్టుకు రుణం ఇప్పిస్తానని చెప్పి సైబర్‌ నేరగాడు నగరానికి చెందిన ఓ మహిళకు కుచ్చుటోపీ వేశాడు.

- సోలార్‌ ప్రాజెక్ట్‌ రుణం పేరుతో మోసం

- మహిళ నుంచి కాజేసిన సైబర్‌ నేరగాడు

హైదరాబాద్‌ సిటీ: ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) అమాయకులను నిలువునా మోసగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సోలార్‌ ప్రాజెక్టుకు రుణం ఇప్పిస్తానని చెప్పి సైబర్‌ నేరగాడు నగరానికి చెందిన ఓ మహిళకు కుచ్చుటోపీ వేశాడు. ఆమె నుంచి రూ.8.13 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగిని(58) సోలార్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో భర్త స్నేహితురాలిని సంప్రదించింది, ఆమె ఇచ్చిన కాంటాక్ట్‌ ద్వారా ఓ వ్యక్తిని సంప్రదించింది.

ఈ వార్తను కూడా చదవండి: Biometric: మేడ్చల్‌- మల్కాజిగిరి కలెక్టరేట్‌లో బయోమెట్రిక్‌


క్రెడిట్‌ సొసైటీ ఉన్నతాధికారి(Credit society officer)గా పరిచయం చేసుకున్న అతడు సోలార్‌ ప్రాజెక్ట్‌కు కావాల్సిన నిధులు 100శాతం రుణంగా ఇప్పిస్తానని చెప్పి, వివరాలు సేకరించాడు. ప్రాసెసింగ్‌ ఫీజు అంటూ మొదలు పెట్టి సబ్సిడీ చార్జ్‌లు, లీగల్‌ ఫీజు, రిఫండబుల్‌ అమౌంట్‌ అంటూ పలుదఫాలుగా రూ.8.13 లక్షలు వసూలుచేశాడు. రుణం మంజూరు అయిందని నకిలీ పత్రాలు చూపుతూ మరింత డబ్బు డిమాండ్‌ చేశాడు. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు

ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్‌ ఎన్నికలకే మొగ్గు

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర

ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 07 , 2025 | 10:45 AM