Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:26 AM
ఆమెకు ముగ్గురు కుమారులున్నారు! బుధవారం ఉదయం ఇంట్లో ఆమె, పెద్ద కుమారుడు, మంచంపట్టిన వృద్ధురాలైన అత్త ఇంట్లో ఉన్నారు. మరో ఇద్దరు కుమారులు డ్యూటీకి వెళ్లిపోయారు.

ఆస్పత్రికి తరలింపు.. ఇద్దరి పరిస్థితి విషమం
దుండగులు చొరబడి దాడి చేశారంటున్న బాధితురాలి మరో ఇద్దరు కుమారులు
మెట్టుగూడలో ఘటన.. తీవ్ర అనుమానాలు
బౌద్ధనగర్, ఫిబ్రవరి6(ఆంధ్రజ్యోతి): ఆమెకు ముగ్గురు కుమారులున్నారు! బుధవారం ఉదయం ఇంట్లో ఆమె, పెద్ద కుమారుడు, మంచంపట్టిన వృద్ధురాలైన అత్త ఇంట్లో ఉన్నారు. మరో ఇద్దరు కుమారులు డ్యూటీకి వెళ్లిపోయారు. ఇంట్లోంచి హాహాకారాలు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా.. తల్లి, కుమారుడు కత్తిపోట్ల గాయాలతో రక్తపుమడుగులో పడి ఉన్నారు. మెట్టుగూడలో ఈ ఘటన జరిగింది. ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడి గుర్తుతెలియని దుండగుల పనేనని మిగతా ఇద్దరు కుమారులు చెబుతున్నారు. కత్తిపోట్లకు గురైన బాధితులు రేణుక (55), ఆమె పెద్ద కుమారుడు యశ్వంత్ (31). రేణుకకు యశ్‌పాల్, వినయ్ అనే మరో ఇద్దరు కుమారులున్నారు. మెట్టుగూడ నల్లపోచమ్మ ఆలయం సమీపంలో ఈ కుటుంబం నివసిస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రేణుక భర్త ఏజీ ఆఫీసులో ఉద్యోగి. మూడేళ్ల క్రితం మృతిచెందాడు.
రేణుక అత్త అనసూయ అనారోగ్యంతో మంచంపట్టింది. యశ్వంత్, ఓ రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. ఉదయం 11 గంటలకు ఇంట్లోంచి ఆర్తనాదాలు విని.. స్థానికులు వెళ్లగా కత్తిపోట్లతో గాయపడిన స్థితిలో రేణుక, యశ్వంత్ కనిపించారు. ఇద్దరినీ చికిత్స కోసం 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. వారు కోమాలో ఉన్నారని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఘటనపై రేణుక మరో కుమారుడు వినయ్ మాట్లాడాడు. తాను, రెండో అన్నయ్య అయిన యశ్‌పాల్ ఉదయం పదింటికే బయటకు వెళ్లిపోయామని.. పదకొండు గంటలకు స్థానికులు ఫోన్‌చేసి ఘటనపై సమాచారమివ్వడంతో ఇంటికొచ్చామని చెప్పాడు. సీసీ ఫుటేజీ పరిశీలిస్తే.. ఉదయం 9-11 గంటల మధ్య గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు కనిపించారని.. నలుగురు లోపలికి చొరబడి తల్లి, అన్నపై దాడి చేశారని చెప్పాడు. అయితే సీసీ ఫుటేజీని పరిశీలిస్తే.. ఎవరైనా ఇంట్లోకి వెళ్లినట్లుగానీ, బయటకు వచ్చినట్లుగానీ కనిపించలేదు. ఘటనాస్థలిలో కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.. కాగా రేణుక ఇద్దరు కుమారులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వినయ్ చెప్పిన అనుమానితులను పోలీసులు ప్రశ్నించగా.. తాము వీధుల్లో తిరుగుతూ బియ్యం కొంటామని, తమకు ఘటనతో సంబంఽధం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News