Hyderabad: బుల్లెట్ బండిపై గంజాయి సరఫరా..
ABN, Publish Date - Jul 12 , 2025 | 08:21 AM
నగరంలో పలు ప్రాంతాల్లో నాలుగు భవనాలు, రూ.లక్షల్లో వడ్డీకి డబ్బు తిప్పుతూ కూడా అధిక సంపాదన కోసం ఓ వ్యాపారి అడ్డదారులు తొక్కాడు. గంజాయి విక్రయాలు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. మల్లాపూర్‌కు చెందిన చెన్న రమేష్ గౌడ్ (27) వడ్డీ వ్యాపారి.
- ఆదాయం కోసం అడ్డదారులు తొక్కిన వడ్డీ వ్యాపారి
- బైక్, గంజాయి స్వాధీనం
హైదరాబాద్ సిటీ: నగరంలో పలు ప్రాంతాల్లో నాలుగు భవనాలు, రూ.లక్షల్లో వడ్డీకి డబ్బు తిప్పుతూ కూడా అధిక సంపాదన కోసం ఓ వ్యాపారి అడ్డదారులు తొక్కాడు. గంజాయి విక్రయాలు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. మల్లాపూర్‌కు చెందిన చెన్న రమేష్ గౌడ్ (27) వడ్డీ వ్యాపారి. భవనాలపై వస్తున్న అద్దె, వడ్డీ డబ్బులు.. ఇలా లక్షల్లో ఆర్జిస్తున్నా ఇంకా సంపాదించాలని గంజాయి వ్యాపారం ప్రారంభించాడు.
ఏపీ నుంచి తక్కువ ధరకు గంజాయిని తెప్పించేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) బైక్‌పై బ్యాగులో గంజాయి ప్యాకెట్లు పెట్టుకొని కస్టమర్లకు సరఫరా చేసేవాడు. పక్కా సమాచారమందుకున్న సికింద్రాబాద్ టీటీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సావిత్రి సౌజన్య బృందం మల్లాపూర్(Mallapur) నుంచి కోటి వైపునకు గంజాయి తీసుకొని వెళ్తున్న రమేష్‌గౌడ్‌ను అడ్డుకొని తనిఖీ చేశారు.
అతని వద్ద 4.50 కిలోల గంజాయి లభ్యం కావడంతో అరెస్ట్ చేశారు. గంజాయితోపాటు రూ. 20వేల నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడితోపాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..
Read Latest Telangana News and National News
Updated Date - Jul 12 , 2025 | 08:21 AM