ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: రైళ్లలో గంజాయి మూటలు..

ABN, Publish Date - Mar 06 , 2025 | 07:06 AM

రైలు మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి బుధవారం విస్తృత తనిఖీలు చేశారు. భువనేశ్వర్‌ రైలులో 26.88 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ పోలీసులు వెల్లడించారు.

- భువనేశ్వర్‌ రైల్లో 26.88, కోణార్క్‌లో 10 కిలోలు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: రైలు మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి బుధవారం విస్తృత తనిఖీలు చేశారు. భువనేశ్వర్‌(Bhubaneswar) రైలులో 26.88 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ పోలీసులు వెల్లడించారు. సరుకు విలువ బహిరంగ మార్కెట్లో రూ. 13.50లక్షలు ఉంటుందన్నారు. కాజీపేట(Kazipet)లో భువనేశ్వర్‌ రైలు ఎక్కిన ఎక్సైజ్‌ బృందాలు సికింద్రాబాద్‌ వరకు విస్తృతంగా తనిఖీలు చేశారు. గంజాయు సరఫరాదారులు ఏమీ తెలియనట్లుగా సాధారణ ప్రయాణికుల్లా నటించి జారుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకుని బండి సంజయ్ ఎమోషనల్


10 కిలోల సరుకు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్‌

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌(Secunderabad) వైపు వస్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆర్పీఎఫ్‌ శక్తి మహిళా కానిస్టేబుళ్లు 10 కిలోల గంజాయి సరుకును పట్టుకున్నారు. బేగంపేట్‌ ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ నసీమా తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్‌ డివిజన్‌ ఆర్పీఎఫ్‌ శక్తి టీం మహిళా కానిస్టేబుళ్లు మాథురి సింగ్‌, లావణ్య, సుధ ఖాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో బుధవారం ఆగి ఉన్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఎస్‌1 కోచ్‌ బెర్త్‌ నంబరు 10లో రూ.2.50 లక్షల విలువైన గంజాయి సరుకును గుర్తించారు. గంజాయిని ఒడిశా నుంచి సికింద్రాబాద్‌ మీదుగా మహారాష్ట్ర తీసుకెళుతున్న ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.


అడ్డగుట్టలో మరో 10 కిలోలు స్వాధీనం

అడ్డగుట్ట: భవన నిర్మాణ కార్మికులకు గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని తుకారాంగేట్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తుకారాంగేట్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా ప్రాంతానికి చెందిన భూషణ్‌ పాలై (26) తుకారాంగేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో భవన నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో కార్మికులకు గంజాయి విక్రయించేవాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు భూషణ్‌ను అరెస్ట్‌ చేశారు. గంజాయి సూత్రధారి గజాం పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి 10 కిలోల గంజాయితో పాటు సెల్‌ఫోన్‌, రూ.1200 నగదును స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తను కూడా చదవండి: BJP victory: బీజేపీదే గెలుపు

ఈ వార్తను కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!

ఈ వార్తను కూడా చదవండి: సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం

ఈ వార్తను కూడా చదవండి: Heatwave: భానుడి భగభగలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 06 , 2025 | 07:06 AM