ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: వారిద్దరూ స్నేహితులు.. చిన్నవిషయంలో వచ్చిన తేడాతో చివరకు..

ABN, Publish Date - Apr 09 , 2025 | 11:48 AM

వారిద్దరూ స్నేహితులు. కానీ.. ఓ చిన్న విషయంలో వచ్చిన తేడాతో చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది. నగరంలోని బోడుప్పల్ కళానగర్‌ కాలనీలో జిమ్‌ నిర్వాహకుడు సాయికిషోర్‌ను డంబెల్‌తో కొట్టిచంపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- జిమ్‌ నిర్వాహకుడిపై డంబెల్‌తో దాడి

- చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి

- నిందితుడి అరెస్టు

హైదరాబాద్: జిమ్‌ నిర్వాహకుడిపై డంబెల్‌తో దాడి చేసిన ఘటనలో తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందగా దాడికి పాల్పడిన నిందితుడిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... బోడుప్పల్‌ కళానగర్‌ కాలనీ(Boduppal Kalanagar Colony)లో నివాసముంటున్న ఎరుపుల సాయికిషోర్‌ (34) వీరారెడ్డి కాలనీలో జస్ట్‌ ఫిట్‌ పేరుతో జిమ్‌ నిర్వహిస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తేనే బీజేపీలో గుర్తింపు


అదే కాలనీలో ఉంటున్న చంటి, సాయికిషోర్‌ స్నేహితులు. వీరిద్దరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. పాత కక్షలతో జరిగిన విషయాలను మనసులో పెట్టుకుని సోమవారం రాత్రి 8 గంటల సమయంలో చంటి మరో ముగ్గురితో కలిసి జిమ్‌కు వెళ్లారు. చంటి జిమ్‌లో ఉన్న డంబెల్‌ను తీసుకుని కిషోర్‌ తలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో కిషోర్‌కు తీవ్రగాయాలయ్యాయి.


వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం కిషోర్‌ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు చంటిని అరెస్టు చేయగా దాడి పాల్గొన్న మరో ఇద్దరు యువకులు పరారీలో ఉన్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 09 , 2025 | 11:48 AM