Hyderabad: ఫిర్యాదు చేస్తే చంపేస్తాం.. గంజాయి బ్యాచ్ వార్నింగ్
ABN, Publish Date - Jul 24 , 2025 | 10:44 AM
రాష్ట్ర ప్రభుత్వ మత్తు పదార్థాల కట్టడికి వివిధ రకాలుగా చర్యలు తీసుకుంటున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం గంజాయి క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వాది ఏ ముస్తఫా బస్తీలో గంజాయి విక్రాయాలు మూడు పువ్వులు ఆరు కాయలు సాగుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
- భయాందోళనకు గురవుతున్న కాలనీవాసులు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ మత్తు పదార్థాల కట్టడికి వివిధ రకాలుగా చర్యలు తీసుకుంటున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం గంజాయి క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వాది ఏ ముస్తఫా బస్తీలో గంజాయి విక్రాయాలు మూడు పువ్వులు ఆరు కాయలు సాగుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాది ఏ ముస్తఫా బస్తీలో రాత్రి సమయంలో స్థానికులు బయటకు రావాలంటే భయపడుతున్నరు. ఈ విషయమై స్థానికులు పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గంజాయి బ్యాచ్ మరింత రెచ్చిపోతున్నారు.
పహాడిషరీఫ్ పోలీసుస్టేషన్(Pahad Sharif Police Station) పరిధిలోని వాది ఏ ముస్తఫా బస్తీలోని మునీర్ మస్జీద్, సాలెహ కిరాణం స్టోర్, వద్ద రాత్రి గంజాయి సేవించే యువకులు రాత్రి సమయంలో రహదారులపై కూర్చొని అటు గా వెళ్లే వారిని వేదిస్తున్నారు. ఎవరైనా ప్రతిఘటిస్తే దాడులు చేస్తున్నారు. అటుగా రాకపోకలు సాగించే వారికి కనబడకుండా స్ట్రీట్ లైట్లను ధ్వంసం చేస్తూ సీసీ కెమెరాల కేబుళ్లను తొలగిస్తున్నారు. వీరి ఆగడాలను భరించని కొందరు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోతున్నారని పలువురు వాపోతున్నారు.
కొందరు స్థానికులు స్ట్రీట్ లైట్ల విషయం సంబంధిత అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుసుకున్న గంజాయి బ్యాచ్ ‘ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తాం’ అని హెచ్చరికలు జారీ చేస్తుండడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలో విద్యార్థినులు, చిన్న పిల్లలు ఉంటార ని రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే ఈ అల్లరి మూకల కారణంగా వెళ్లలేక పోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అధికారులు స్పందించి పెట్రోలింగ్ పెంచి గంజాయి బ్యాచ్‌పై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
చర్యలు తీసుకోవాలి
వాది ఏ ముస్తఫా బస్తీలో గంజాయి సేవించే యువకులు వీధి దీపాలను ధ్వంసం చేసి రోడ్డుపై తిష్ఠవేసి అటుగా వెళ్లే వారిని వేదిస్తూ దాడులు చేస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పని చేయకుండా చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అంతం చేస్తామంటూ బెదిరిస్తున్నారు. వీరికి భయపడిన పేదలు ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోతున్నారు. పోలీసులు నిఘా పెట్టి గంజాయి బ్యాచ్‌పై కఠిన చర్యలు తీసు కోవాలి. ప్రజలకు రక్షణ కల్పించాలి.
- ఎండీ హుస్సేన్, జల్‌పల్లి
మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ పార్టీ
మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
2 నెలల్లో ఓఆర్‌ఆర్ ఆర్థిక ప్రతిపాదనలు
Read Latest Telangana News and National News
Updated Date - Jul 24 , 2025 | 10:44 AM