Hyderabad: ఇల్లు విషయంలో వివాదం.. మారుతండ్రి దారుణ హత్య
ABN, Publish Date - Mar 07 , 2025 | 06:45 AM
అన్యోన్యంగా సాగుతున్న ఆ దంపతుల మధ్య కుమారుడి రాకతో చిచ్చు మొదలైంది. చివరకు అది హత్యకు దారి తీసింది. బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం షబానాబేగం(35)కు గతంలో ఓ వ్యక్తితో వివాహమైంది.
- కొడుకు రాకతో మొదలైన కలహాలు
- రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకేసులో నిందితుల అరెస్ట్
హైదరాబాద్: అన్యోన్యంగా సాగుతున్న ఆ దంపతుల మధ్య కుమారుడి రాకతో చిచ్చు మొదలైంది. చివరకు అది హత్యకు దారి తీసింది. బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ(Bandlaguda Inspector Satyanarayana) కథనం ప్రకారం షబానాబేగం(35)కు గతంలో ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి సమీర్ (19) పుట్టాడు. సమీర్‌కు మూడు నెలల వయస్సు ఉన్నప్పుడే భర్తతో షబానా బేగం విడాకులు తీసుకుంది. ఆ సమయంలో సమీర్ తండ్రి వద్దే ఉన్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నాకు తరలిరావాలి
కొన్నాళ్ల తర్వాత షబానా బేగం బంజారాహిల్స్‌కు చెందిన మసీయుద్దీన్‌ను వివాహం చేసుకుంది. 12 ఏళ్లుగా భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తున్నారు. మసీయుద్దీన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతడికి షబానా మూడో భార్య. ఆమెను తీసుకొని తరచూ పబ్‌లు, పార్టీలు, రెస్టారెంట్లకు వెళ్లేవాడు. ఇదిలాఉండగా, తండ్రితో గొడవ పడిన సమీర్ ఆరు నెలల క్రితం తల్లి షబానా బేగం వద్దకు వచ్చేశాడు. తల్లితో మసీయుద్దీన్ పార్టీలకు, పబ్‌లకు వెళ్లడం సమీర్‌కు నచ్చేది కాదు.
దీంతో తల్లిని తీసుకుని బండ్లగూడ లేక్ వ్యూ హిల్స్ అపార్ట్‌మెంట్లో అద్దెకు దిగారు. అయినప్పటికీ ఇంటి అద్దె, ఖర్చుల కోసం మసీయుద్దీన్ నెలనెలా వారికి డబ్బులు ఇచ్చేవాడు. తరచూ షబానా బేగం వద్దకు వస్తుండేవాడు. భార్యతో సరదాగా గడుపుదామనుకున్న మసీయుద్దీన్‌కు సమీర్ అడ్డుగా ఉండేవాడు. ఈ విషయమే మసీయుద్దీన్, సమీర్ల(Masiuddin, Sameerla) మధ్య గొడవలకు కారణమైంది. తనకు ఇల్లు కొని ఇవ్వాలని, కుమారుడికి వ్యాపారం పెట్టించాలని మసీయుద్దీన్‌ను షబానా బేగం తరచూ అడిగేది.
ఈ విషయమై ఈనెల 3వ తేదీన షబానా బేగంకు, మసీయుద్దీన్‌కు మధ్య గొడవ జరిగింది. అక్కడే ఉన్న సమీర్ స్నేహితుడైన ఫరీద్‌కు ఫోన్ చేసి, ఇంటికి రావాలని కోరాడు. సోఫాలో కూర్చున్న మసీయుద్దీన్ తలపై ఇద్దరూ ఇనుప వస్తువుతో కొట్టడంతో అతడు కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతరం సమీర్, ఫరీద్‌లు చున్నీతో మసీయుద్దీన్ కాళ్లు, చేతులు కట్టేశారు. కూరగాయలు కోసే కత్తితో మసీయుద్దీన్ గొంతుపై పొడిచి సమీర్ హత్య చేశాడు.
మృతదేహాన్ని అక్కడే వదిలి ముగ్గురూ పరారయ్యారు. అయితే షబానా బేగంకు ఇచ్చేందుకు మసీయుద్దీన్ రూ. 50 లక్షలు తెచ్చాడని, ఈ డబ్బుతో మాయమైందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈనెల 4న జరిగిన ఈ హత్య కేసులో బండ్లగూడ పోలీసులు మహ్మద్ సమీర్, అతని స్నేహితుడు మహ్మద్ ఫరీదుదీన్, షబానా బేగంలను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తను కూడా చదవండి: కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి
ఈ వార్తను కూడా చదవండి: Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!
ఈ వార్తను కూడా చదవండి: Transfers: భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు!?
ఈ వార్తను కూడా చదవండి: ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ ఫోకస్
Read Latest Telangana News and National News
Updated Date - Mar 07 , 2025 | 06:45 AM