Share News

కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి

ABN , Publish Date - Mar 07 , 2025 | 05:24 AM

ప్రేమకు ఎల్లలు లేవని ఆ జంట నిరూపించింది. ఖండాలు దాటిన ఆ జంట ప్రేమ ఏడు అడుగులతో నూరేళ్ల వివాహ బంధంలోకి అడుగిడింది.ప్రేమకు ఎల్లలు లేవని ఆ జంట నిరూపించింది. ఖండాలు దాటిన ఆ జంట ప్రేమ ఏడు అడుగులతో నూరేళ్ల వివాహ బంధంలోకి అడుగిడింది.

కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి

  • కేసముద్రంలో ఘనంగా వివాహం

కేసముద్రం, మార్చి 6: ప్రేమకు ఎల్లలు లేవని ఆ జంట నిరూపించింది. ఖండాలు దాటిన ఆ జంట ప్రేమ ఏడు అడుగులతో నూరేళ్ల వివాహ బంధంలోకి అడుగిడింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన వేల్పుల రాజేష్‌ యాదవ్‌- ప్రసన్నలత దంపతుల పెద్ద కొడుకు సాయి చైతన్య ఉన్నత చదువుల నిమిత్తం ఎనిమిదేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లారు. చదువు పూర్తయ్యాక అక్కడే ఓ కంపెనీలో ఈవెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో అకౌంటెంట్‌గా చేరిన దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియా దేశానికి చెందిన యుక్లేడిస్‌ ఖింతేరో- వోల్గా మరియ దంపతులు కూతురు రియాతో సాయి చైతన్యకు నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాంతో ఇరు కుటుంబాలను ఒప్పించుకుని గురువారం కేసముద్రం అమినాపురంలో హిందూ సంప్రదాయంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వధువు అన్న- వదిన సరియో- జులియానా పెళ్లికి హాజరయ్యారు.

Updated Date - Mar 07 , 2025 | 05:24 AM