ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరుడు శ్రీహరిపై కేసు

ABN, Publish Date - Feb 14 , 2025 | 07:33 AM

ఫ్లాట్‌ అమ్మకపోతే చంపేస్తామని బెదిరించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం(Gangster Nayeem) అనుచరుడు శ్రీహరిపై సైదాబాద్‌ పోలీసులు(Saidabad Police) కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: ఫ్లాట్‌ అమ్మకపోతే చంపేస్తామని బెదిరించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం(Gangster Nayeem) అనుచరుడు శ్రీహరిపై సైదాబాద్‌ పోలీసులు(Saidabad Police) కేసు నమోదు చేశారు. సైదాబాద్‌ కరన్‌బాగ్‌లోని లక్ష్మీఅపార్ట్‌మెంట్స్‌ ఫ్లాట్‌ నంబరు-1లో వై.ప్రకాశ్‌ రెడ్డి, అనురాధ దంపతుల కుటుంబం 20 ఏళ్లుగా నివసిస్తున్నారు. నయీం అనుచరుడిగా చలామణి అవుతున్న పి. శ్రీహరి ఆ అపార్ట్‌మెంట్‌లో పెంట్‌హౌస్‌ అద్దెకు తీసుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ప్రాణాలు తీసిన అతివేగం..


దానితోపాటు మరో నాలుగు ఫ్లాట్లను స్వాధీనం చేసుకున్నాడు. ఫ్లాట్‌ను విక్రయించాలని ప్రకాశ్‌రెడ్డి(Prakash Reddy)ని రెండేళ్లుగా బెదిరిస్తున్నాడు. అమ్మబోనని ఆయన పలుమార్లు చెప్పాడు. దీంతో శ్రీహరి, భార్య మాధవి, అతడి కుమారుడు ప్రసాద్‌, కుమార్తె పింకి ఆదివారం రాత్రి ప్రకాశ్‌రెడ్డి కుటుంబ సభ్యులపై దాడిచేశారు. ప్రకాశ్‌రెడ్డి భార్య అనురాధ ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీహరి, అతడి కుటుంబసభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


ఈవార్తను కూడా చదవండి: ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!

ఈవార్తను కూడా చదవండి: సంజయ్‌, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు

ఈవార్తను కూడా చదవండి: ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్‌ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి

ఈవార్తను కూడా చదవండి: Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర

Read Latest Telangana News and National News

Updated Date - Feb 14 , 2025 | 07:33 AM