Hyderabad: ప్రాణాలు తీసిన అతివేగం..
ABN , Publish Date - Feb 14 , 2025 | 07:12 AM
బస్సును ఓవర్‌టేక్ చేయబోయి ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. అల్వాల్ ట్రాఫిక్ ఎస్‌హెచ్‌వో నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్(Bihar)కు చెందిన శత్రుగన్ కుమార్‌శర్మ(30), అతడి స్నేహితుడు రాహుల్‌కుమార్ బాలాజీనగర్‌లో నివసిస్తూ కార్పెంటర్లుగా పనిచేస్తున్నారు.

- వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
హైదరాబాద్: అతివేగం వారి ప్రాణాలను తీసింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా, నారాయణపురం మండలం, జనగాం గ్రామానికి చెందిన ఏకమళ్ల చరణ్(25), వనపర్తి జిల్లా, ఖిల్లాగన్‌పూర్ మండలం, పర్వతపురం గ్రామానికి చెందిన కె.పవన్(24) వనస్థలిపురం సామనగర్‌లోని సిరి మోటార్స్ కార్ మెకానిక్ షెడ్‌లో మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. చరణ్ హయత్‌నగర్‌లో నివసిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి విధులు ముగించుకున్న తర్వాత ఇద్దరూ బైక్‌పై టీ తాగటానికి వెళ్తున్నారు. వేగంగా వెళ్తున్న వీరు భాగ్యలత దాటితన తర్వాత భారత్ బెంజ్ షోరూ వద్ద రోడ్డుపై ఆపివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వనస్థలిపురం పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నీ ఫ్లాట్ అమ్మకపోతే చంపేస్తాం..
బస్సును ఓవర్‌టేక్ చేయబోయి..
హైదరాబాద్: బస్సును ఓవర్‌టేక్ చేయబోయి ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. అల్వాల్ ట్రాఫిక్ ఎస్‌హెచ్‌వో నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్(Bihar)కు చెందిన శత్రుగన్ కుమార్‌శర్మ(30), అతడి స్నేహితుడు రాహుల్‌కుమార్ బాలాజీనగర్‌లో నివసిస్తూ కార్పెంటర్లుగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో బాలాజీనగర్ నుంచి తూంకుటకు బైక్‌పై వేగంగా వెళ్తున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ వద్ద ముందు వెళ్తున్న బస్సును శత్రుగన్ కుమార్‌శర్మ ఓవర్ టేక్ చేస్తుండగా బైక్ అదుపు రోడ్డుపై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాహుల్‌కుమార్‌కు స్వల్పగాయాలయ్యాయి. హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే శత్రుగన్ కుమార్‌శర్మ చనిపోయాడని ఎస్‌హెచ్‌వో నాగరాజు తెలిపారు. అల్వాల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!
ఈవార్తను కూడా చదవండి: సంజయ్, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు
ఈవార్తను కూడా చదవండి: ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి
ఈవార్తను కూడా చదవండి: Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర
Read Latest Telangana News and National News