ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Call Forwarding Scam: కాల్ ఫార్వార్డింగ్ స్కామ్.. ఈ ఉచ్చులో పడితే మీ జేబులు ఖాళీ

ABN, Publish Date - Jul 12 , 2025 | 08:35 AM

యూజర్‌కు తెలీకుండానే కాల్ ఫార్వార్డింగ్ యాక్టివేట్ చేసి డబ్బులు తస్కరించేందుకు ప్రయత్నించాడో సైబర్ క్రిమినల్. ఈ ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అయితే, ఇలాంటి స్మామ్‌ల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మెసేజీ, వాట్సాప్‌లో అపరిచిత వ్యక్తులు పంపించే లింక్స్‌పై క్లిక్ చేయొద్దన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో, సైబర్ నేరగాళ్లు కొత్త ట్రిక్స్‌కు తెరతీశారు. బాధితులు ఎలాంటి లింక్స్‌పై క్లిక్ చేయకపోయినా వారి వివరాలను తస్కరించే నయా మోసానికి తెరతీశారు. ఇందుకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన కలకలానికి దారి తీసింది.

తాజా ఘటనలో ఓ సైబర్ క్రిమినల్ బాధితుడికి ఫోన్ చేసి ఓ పార్సిల్ డెలివరీ మిస్సైందని నమ్మించాడు. ఆ తరువాత అతడికి ఓ నంబర్ ఇచ్చి దానికి కాల్ చేస్తే సూపర్‌వైజర్‌తో మాట్లాడొచ్చని చెప్పుకొచ్చాడు. 21* డయల్ చేశాక తను ఇచ్చిన నెంబర్‌ను డయల్ చేసి చివర్లో # ప్రెస్ చేయాలని చెప్పాడు. అయితే, బాధితుడు ఇలా చేయగానే అతడికి తెలీకుండానే ఫోన్‌లో పూర్తిస్థాయి కాల్ ఫార్వార్డింగ్ యాక్టివేట్ అయ్యింది. బాధితుడికి వచ్చే కాల్స్ అన్ని స్కామర్ మొబైల్‌కు బదిలీ అయ్యాయి. ఓటీపీల వంటి కీలక సమాచారం కూడా వారికి చేరే ముప్పు ఏర్పడింది.

అయితే, తన ఫోన్‌లో అనుమానాస్పద యాక్టివిటీ కనిపించడంతో సదరు యూజర్ అలర్ట్ అయ్యారు. ఇక ఫోన్‌లో మాల్‌వేర్ చొరబడ్డ ఆనవాళ్లు కూడా లేకపోవడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తరువాత ఏఐ సాయంతో తన కాల్ లాగ్స్, ఫోన్ సెట్టింట్స్‌ను నిశితంగా పరిశీలించగా సైబర్ నేరగాళ్ల కుట్ర బయటపడింది. బాధితుడికి తెలియకుండానే అతడి ఫోన్ నుంచి కాల్స్ ఫార్వార్డ్ అవుతున్నట్టు ఏఐ గుర్తించింది. ఆ తరువాత కాల్ ఫార్వార్డింగ్‌ను ఎలా ఆఫ్ చేయాలో కూడా ఏఐ సూచించింది. వీటిని పాటించిన వ్యక్తి భారీ నష్టం జరగకమునుపే తన ఆస్తులను కాపాడుకోగలిగాడు.

ఇలాంటి స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అపరిచిత వ్యక్తులు చెప్పిన నెంబర్లను ఫోన్‌లో అస్సలు ఎంటర్ చేకూడదు. ఓటీపీలకి బదులు టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ విధానాన్ని వాడితే మరింత భద్రత ఉంటుంది. అనుమానాస్పద కార్యకలాపాల గురించి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు ఫోన్ చేసి చెప్పాలి.

cybercrime.gov.in పోర్టల్‌లో కూడా వినియోగదారులు తమ ఫిర్యాదును దాఖలు చేయొచ్చు. ##002# కోడ్ టైప్ చేస్తే అన్ని కాల్ ఫార్వార్డింగ్స్ నిలిచిపోతాయి. ఈ టిప్స్ పాటిస్తే సైబర్ దాడుల నుంచి రక్షణ లభిస్తుందని టెక్ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రియుడి మోజులో వివాహిత దారుణం.. మంచానపడ్డ భర్తను కిరాతకంగా హత్య

ఆన్‌లైన్‌లో హోటల్ గది బుక్ చేద్దామని ప్రయత్నిస్తే ఊహించని షాక్

Read Latest and Crime News

Updated Date - Jul 12 , 2025 | 09:03 AM