ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Secunderabad: రైల్వేస్టేషన్‌లో 56 కిలోల గంజాయి పట్టివేత

ABN, Publish Date - Feb 05 , 2025 | 08:28 AM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌(Konark Express) రైలులో తనిఖీలు చేసిన జీఆర్‌పీ పోలీసులు ఓ వ్యక్తి నుంచి రూ 14.07 లక్షల విలువ చేసే 56.285 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌(Konark Express) రైలులో తనిఖీలు చేసిన జీఆర్‌పీ పోలీసులు ఓ వ్యక్తి నుంచి రూ 14.07 లక్షల విలువ చేసే 56.285 కిలోల గంజాయిని పట్టుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎ్‌సపీ జావెద్‌, సికింద్రాబాద్‌ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. మహరాష్ట్ర పూణే(Maharashtra Pune)కు చెందిన లక్ష్మణ్‌ సాంబాజీ మొగల్‌ (36) కూలీ పనిచేస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వార్నీ.. చివరకు డాక్టర్ కూడా మోసపోయారుగా.. విషయం ఏంటంటే..


2006లో రైలు ప్రమాదంలో చేయి కోల్పోయిన మొగల్‌ ఆర్థిక పరిస్థితి బాగలేక గంజాయి వ్యాపారంతో సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. మనోరంజన్‌ అనే వ్యక్తి నుంచి రూ. 14.07 లక్షల విలువ చేసే 56.285కిలోల గంజాయి సరుకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో విక్రయించాలనుకున్నాడు. చత్రాపూర్‌ రైల్వే స్టేషన్‌(Chatrapati Shivaji Maharaj Railway Station)లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కిన మొగల్‌ సరుకుతో జనరల్‌ బోగిలో ప్రయాణం చేస్తున్నాడు.


మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ 10 ప్లాట్‌ ఫాంపై ఆగిన కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) తనిఖీలు చేపట్టారు. జనరల్‌ బోగిలో ఉన్న మొగల్‌ను అనుమానస్పదస్థితిలో అదుపులోకి తీసుకుని విచారించగా ఇతని వద్ద నుంచి జనరల్‌ బోగిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను కోనుగోలు చేసిన మనోరంజన్‌ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.


ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై

ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

ఈవార్తను కూడా చదవండి: చిక్కరు.. దొరకరు!

ఈవార్తను కూడా చదవండి: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 05 , 2025 | 08:28 AM